LIVE
గుజరాత్‌లో కమల వికాసం.. హిమాచల్‌‌లో గట్టెక్కిన కాంగ్రెస్..!

గుజరాత్‌లో కమల వికాసం.. హిమాచల్‌‌లో గట్టెక్కిన కాంగ్రెస్..!

డిసెంబర్ 8వ తేదీన గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వెలువడతాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌కు రెండు దశల్లో అంటే డిసెంబర్ 1న డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం గుజరాత్‌లో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ఆప్ ఎంట్రీతో గుజరాత్‌లో త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి. గుజరాత్‌లో 66.31శాతం పోలింగ్ నమోదైంది.

ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌ కంటే ముందే ఒకే విడతలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 35.

Gujarat and Himachal pradesh Assembly election results 2022 live updates in telugu:Will BJP take hold in two states?

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఆప్ కూడా గట్టి పోటీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇక రెండు ప్రధాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

11:39 PM
Dec 8, 2022

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీజేపీ 25 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లు విజయం సాధించారు.

11:38 PM
Dec 8, 2022

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

11:37 PM
Dec 8, 2022

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ.

10:52 PM
Dec 8, 2022

గుజరాత్ గెలుపు.. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తుంనడానికి నాంది అని మోడీ వ్యాఖ్యానించారు.

9:47 PM
Dec 8, 2022

కొత్త ఆకాంక్షలకు ప్రతిరూపమే ఈ తీర్పు అని అన్నారు. ఈ విజయాలు పెద్ద కఠిన నిర్ణయాలకు నాంది పలుకుతాయన్నారు మోడీ.

9:13 PM
Dec 8, 2022

గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందన్నారు మోడీ. గుజరాత్ ప్రజలు అన్ని రికార్డులూ బ్రేక్ చేశారని అభినందించారు.

9:12 PM
Dec 8, 2022

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి మోడీ పాల్గొన్నారు.

9:12 PM
Dec 8, 2022

ప్రజల ఆశీర్వాదంతోనే గత రికార్డులు తిరగరాస్తూ బీజేపీ విజయం సాధించిందన్నారు మోడీ.

8:46 PM
Dec 8, 2022

ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఫలితాలే నిదర్శనమిన అన్నారు మోడీ.

8:20 PM
Dec 8, 2022

గుజరాత్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని మరోసారి నిరూపించాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

8:04 PM
Dec 8, 2022

దేశానికి ఏ సవాల్ ఎదురైనా ప్రజల నమ్మం బీజేపీపైనే ఉంది: ప్రధాని మోడీ

7:45 PM
Dec 8, 2022

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయామని ప్రధాని మోదీ అన్నారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.

7:26 PM
Dec 8, 2022

గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని మోదీ అన్నారు. స్థానికుల ఆశీర్వాదం వల్లే మరోసారి గెలిచామని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తోందని పేర్కొన్నారు.

7:00 PM
Dec 8, 2022

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిందని సీఎం జైరాం ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాంగ్రెస్ అతి తక్కువ ఓట్లతో విజయం సాధించిందన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు.

6:41 PM
Dec 8, 2022

సుపరిపాలన, సత్వర అభివృద్ధి వల్లే గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీని రికార్డ్ స్థాయిలో గెలపించారని పేర్కొన్న త్రిపుర సీఎం మాణిక్ సాహో.

6:24 PM
Dec 8, 2022

హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ పరాజయంపై ప్రధాని మోదీ స్పందించారు. పార్టీ పట్ల ప్రజలు చూపిన అభిమానానికి, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని చెప్పారు.

6:19 PM
Dec 8, 2022

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మైన్‌పురి ఉపఎన్నికల్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

6:07 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
బిలాస్‌పూర్
త్రిలోక్ జామ్‌వాల్
బీజేపీ
బంబర్ ఠాకూర్
కాంగ్రెస్
Vs
హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్‌ బిలాస్‌పూర్‌లో త్రిలోక్ జమ్వాల్ లీడింగ్. వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి బంపర్ ఠాకూర్.
5:58 PM
Dec 8, 2022

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని కార్యకర్తల గెలుపుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. అసాధారణమైన వారి కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొన్నారు.

5:54 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
దారంగ్
పూరన్ చంద్ ఠాకూర్
బీజేపీ
కౌల్ సింగ్ ఠాకూర్
కాంగ్రెస్
Vs
హిమాచల్ ప్రదేశ్ : దరంగ్ స్థానంలో పూనమ్ చంద్ ఠాకూర్ గెలుపు. ఓటమి చవి చూసిన కాంగ్రెస్ అభ్యర్థి కౌల్ సింగ్ ఠాకూర్.
5:47 PM
Dec 8, 2022

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గాను హస్తం 40 చోట్ల గెలుపొందింది. బీజేపీ 25 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు.

5:24 PM
Dec 8, 2022

గుజరాత్‌లో అధికార పిఠాన్ని మరోసారి బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో కమలం విజయకేతనం ఎగురవేసింది. ఘోర పరాజయంతో కాంగ్రెస్ 17 సీట్లకు పరిమితమైంది. ఆప్ 5, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.

5:21 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
షిమ్లా
హరీష్ జనార్థ
కాంగ్రెస్
సంజయ్ సూద్
బీజేపీ
Vs
హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో విజయం సాధించిన హరీష్ జనార్థ. బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ ఇక్కడ ఓడిపోయారు.
5:20 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
జస్వన్ ప్రగ్‌పూర్
బిక్రమ్ ఠాకూర్
బీజేపీ
సురీందర్ సింగ్ మంకోటియా
కాంగ్రెస్
Vs
హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్ జశ్వన్ ప్రగ్‌పూర్‌లో గెలిచిన బిక్రమ్ థాకూర్. సురీందర్ సింగ్ మన్‌కొటియా పరాజయం.
5:19 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
ఫతేపూర్
భవానీ సింగ్ పఠానియా
కాంగ్రెస్
క్రిపాల్ సింగ్ పర్మార్
ఇండిపెండెంట్
Vs
హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్ ఫతేపూర్‌లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి భవాని సింగ్ పథానియా. బీజేపీ రెబెల్‌ క్రిపాల్ సింగ్ పర్మార్‌ ఓటమి. కొనసాగుతున్న భవానీ సింగ్ పథానియా. ట్రయలింగ్‌లో ఉన్న క్రిపాల్ సింగ్ పర్మార్
5:13 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
డాల్హౌసీ
డీఎస్ ఠాకూర్
బీజేపీ
ఆషా కుమారీ
కాంగ్రెస్
Vs
హిమాచల్ ప్రదేశ్ : డల్హౌసీలో గెలిచిన డీఎస్ ఠాకూర్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఆశాకుమారి ఓటమి.
5:07 PM
Dec 8, 2022

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపిన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.

4:58 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
మెహమెదాబాద్
అర్జున్ సిన్హ్ చౌహాన్
బీజేపీ
జువాన్‌సిన్హ్ గడాభాయ్
కాంగ్రెస్
Vs
గుజరాత్ : మెహ్మదాబాద్‌‌ స్థానంలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అర్జున్‌సిన్హ్ చౌహాన్. జువాన్‌సిన్హ్ గడాభాయ్ ఓటమి.
4:57 PM
Dec 8, 2022
నువ్వా - నేనా
వావ్
గెనిబెన్ ఠాకూర్
కాంగ్రెస్
స్వరూప్‌ జీ ఠాకూర్
బీజేపీ
Vs
గుజరాత్ : గుజరాత్ వవ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జెనిబెన్ ఠాకూర్. బీజేపీకి చెందిన స్వరూప్‌జీ ఠాకూర్‌ ఓటమి.
4:56 PM
Dec 8, 2022

గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా అవతరించిందని ఆపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజివాల్ అన్నారు.10 సంత్సరాల క్రితం ఒక చిన్న పార్టీ.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. జాతీయ పార్టీగా మారిందని చెప్పారు.

READ MORE