గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 36 మందితో రెండో జాబితా విడుదల
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది.
Recommended Video

Gujarat Assembly Election 2017 : BJP Releases Third List Of 28 Candidates | Oneindia Telugu
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది.
వీరిలో 13 మంది ఎస్సీలకు, ఇద్దరు ఎస్టీలకు టిక్కెట్లు ఇచ్చింది. కాగా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సన్నిహితుడు కేతన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు బీజేపీలో చేరారు.

బీజేపీ విడుదల రెండో జాబితాలో చోటు దక్కుతుందని ఆశపడి, భంగపడిన నాయకులు గాంధీనగర్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. తమకు అవకాశం ఎందుకివ్వలేదంటూ మండిపడ్డారు. రెండో జాబితాలో మార్పులు చేయకుంటే ఆయా స్థానాల్లో బీజేపీ ఓటమి ఖాయమంటూ నినాదాలు చేశారు.
కాగా, 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ ఇప్పటి వరకు 106 మంది అభ్యర్థులను ప్రకటించింది. డిసెంబర్ 9న, 14వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications