వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలువైన సూచన చేసిన ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నియోజకవర్గాల్లో భారతీయ జనత పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వరుసగా రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లందరూ అక్కడే మకాం వేశారు. కేంద్ర మంత్రులూ రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నారు.

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శికి కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్ జగన్..!!ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శికి కీలక బాధ్యతలను అప్పగించిన వైఎస్ జగన్..!!

 స్టార్ క్యాంపెయినర్ల మకాం..

స్టార్ క్యాంపెయినర్ల మకాం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పలువురు కేంద్రమంత్రులు వేర్వేరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. హామీల వర్షాన్ని కురిపిస్తోన్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఫలితంగా ఆయా పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థుల మధ్య పోటాపోటీగా ప్రచార యుద్ధం సాగుతోంది.

ఖర్గె కామెంట్స్‌పై..

ఖర్గె కామెంట్స్‌పై..

మలి విడత ప్రచార పర్వంలో భాగంగా భాగంగా- పంచ మహల్ జిల్లాలోని కలోల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పి కొట్టారు. మల్లికార్జున ఖర్గె అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అంటూనే విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం చెప్పినట్లుగా ఆయన నడుచుకుంటోన్నారని ధ్వజమెత్తారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచాలంటూ మోదీ సూచన చేశారు.

గుజరాత్ రామభక్తుల భూమి..

గుజరాత్ రామభక్తుల భూమి..

మల్లికార్జున ఖర్గె తనను వంద తలల రావణుడితో పోల్చారని, నిజానికి తాము రామభక్తులమని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో రామభక్తులు తమ సత్తా చాటుతారని, ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులందరూ ప్రజాస్వామ్యం కంటే గాంధీ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారంటూ మోదీ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచాలని హితవు పలికారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచాలంటూ మోదీ సూచన చేశారు.

ప్రజాస్వామ్యంపై

ప్రజాస్వామ్యంపై

ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి చేరుకునేది కాదని మోదీ ఎదురుదాడి చేశారు. ఒకే కుటుంబాన్ని నమ్ముతారని, అది ప్రజాస్వామ్యం కాబోదని అన్నారు. ఒక కుటుంబాన్ని సంతోష పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు ఏదైనా చేయగలరంటూ ధ్వజమెత్తారు. ఆ కుటుంబమే తమకు సర్వస్వంగా భావిస్తారని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచరని మండిపడ్డారాయన. మోదీని ఎవరు ఎంత ఎక్కువగా తిడితే అంత గుర్తింపు అనే విధానం కాంగ్రెస్‌లో ఉందని పేర్కొన్నారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ముమ్మరంగా పోలింగ్..

ముమ్మరంగా పోలింగ్..

గుజరాత్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. దక్షిణ గుజరాత్‌, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ ఉంటుంది. తొలి విడతలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362 మంది పురుషులు, 1,1,5,42,811 మంది మహిళలు, 497 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

English summary
PM Narendra Modi hits back to Congress and said that they doesn't know that this is Ram Bhakts' Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X