యువకుడ్ని రాడ్‌తో కొడ్తూ కెమెరికా చిక్కిన ఎమ్మెల్యే

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో బిజెపి శాసనసభ్యుడొకరు తాగిన యువకుడ్ని రాడ్‌తో కొడుతూ కెమెరికా కంటికి చిక్కారు. గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ జిల్లాలో సోమవారం ఈ సంఘటన జరిగింది. తాగిన మత్తులో ఉన్న యువకుడు కత్తిని ఊపుతూ కనిపించాడని, దాంతో శాసనసభ్యుడు తమను పిలిచారని పోలీసులు అంటున్నారు.

అయితే, మోర్బీ బిజెపి ఎమ్మెల్యే కాంతి అమృతియా, అతని బాడీగార్డ్ యువకుడిని రాడ్స్‌తో కొడుతున్న దృశ్యాలను అక్కడ ఉన్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. ఆ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ వాట్సప్‌లోనూ హల్‌చల్ చేస్తోంది.

Gujarat BJP MLA 'beats' youth with rod, caught on camera

యువకుడు జగదీష్ లోఖిల్ మోర్బీలోని ఉమా టౌన్‌షిప్ సమీపంలో చిత్తుగా తాగి కత్తిని ప్రదర్శిస్తూ కనిపించాడని, అక్కడ శాసనసభ్యుడు కూడా ఉన్నారని పోలీసులు అంటున్నారు. అమృతియా పోలీసులను పిలిచారని, దాంతో తాము అక్కడికి వెళ్లామని వారు చెబుతున్నారు.

ఆయుధాల నిరోధక చట్టం కింద యువకుడిని అదుపులోకి తీసుకున్నామని బీ డివిజన్ పోలీసు స్టేషన్ అధికారులు చెప్పారు. కాగా, దీనిపై మాట్లాడడానికి అమృతియా అందుబాటులో లేరని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+