Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Leader: లేడీ లీడర్ తో నా భర్తకు అక్రమ సంబంధం, కేంద్ర మాజీ మంత్రి మీద గృహహింస కేసు పెట్టిన భార్య !

అహమ్మదాబాద్/న్యూఢిల్లీ: జాతీయ పార్టీకి చెందిన ఓ నాయకుడు కేంద్ర మంత్రిగా గతంలో చక్రం తిప్పాడు. రెండుసార్లు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడిగా పని చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన పేరు కూడా ఉంది. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నాయకుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మంచి విందు భోజనం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అంటూ చర్చలు మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆ కేంద్ర మాజీ మంత్రి భార్య ఇంటి నుంచి బయటకు వచ్చి భర్త మీద సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త నాకు టార్చర్ పెడుతున్నాడు. ఇంతకాలం ప్రతిరోజు ఇంట్లో నరకం చూపించాడు. ఎదురుతిరిగిన నన్ను ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటేశాడు, లేడీ లీడర్ తో తన భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ ఆమె కేసు పెట్టడం కలకలం రేపింది. కేంద్ర మాజీ మంత్రి, టాప్ లీడర్ మీద ఆయన భార్య గృహహింస కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణ చెయ్యడం కలకలం రేపింది.

మాజీ సీఎం కొడుకు...... కేంద్ర మాజీ మంత్రి

మాజీ సీఎం కొడుకు...... కేంద్ర మాజీ మంత్రి

గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, కేంద్ర మాజీ మంత్రిగా భరత్ సింగ్ సోలంకీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా గతంలో భరత్ సింగ్ సోలంకీ చక్రం తిప్పాడు. రెండుసార్లు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షుడిగా భరత్ సింగ్ సోలంకీ పని చేశారు. భరత్ సింగ్ సోలంకీ తండ్రి మాధవ్ సింగ్ సోలంకి గుజరాత్ కు నాలుగు సార్లు సీఎంగా పని చేశారు. కేంద్ర విదేశాంగా మంత్రిగా పని చేసిన మాధవ్ సింగ్ సోలంకీ 2021 జనవరిలో మరణించారు.

సీఎం రేసులో సోలంకీ ?

సీఎం రేసులో సోలంకీ ?


గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో భగత్ సింగ్ సోలంకీ పేరు కూడా ఉందని సమాచారం. గుజరాత్ లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు భగత్ సింగ్ సోలంకీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మంచి విందు భోజనం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మనం గుజరాత్ లో కచ్చితంగా అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అంటూ చర్చలు మొదలు పెట్టారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భగత్ సింగ్ సోలంకీ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భగత్ సింగ్ సోలంకీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

బాంబు పేల్చిన కేంద్ర మాజీ మంత్రి భార్య

బాంబు పేల్చిన కేంద్ర మాజీ మంత్రి భార్య

ఇలాంటి సమయంలో కేంద్ర మాజీ మంత్రి భగత్ సింగ్ సోలంకీ భార్య రేష్మా పటేల్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆమె భర్త మీద సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త భగత్ సింగ్ సోలంకి నన్ను టార్చర్ పెడుతున్నాడని. ఇంతకాలం ప్రతిరోజు ఇంట్లో తనకు నరకం చూపించాడని రేష్మా పటేల్ ఆరోపించడం కలకలం రేపింది.

ఇంటి నుంచి బయటకు గెంటేశాడు

ఇంటి నుంచి బయటకు గెంటేశాడు

తన భర్త ఆగడాలకు ఎదురుతిరిగిన నన్ను తన భర్త భగత్ సింగ్ సోలంకీ తనను ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటేశాడని రేష్మా పటేల్ ఆనంద్ బోర్సాద్ కోర్టులో భర్త మీద ఆమె పిటిషన్ దాఖలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తన భర్త భగత్ సింగ్ సోలంకీకి తాను విడాకులు ఇవ్వడం ఇష్టంలేదని, అయితే తనకు టార్చర్ ఎక్కువ అయ్యిందని రేష్మా పటేల్ ఆరోపిస్తున్నారు.

నా భర్తకు లేడీ లీడర్ తో అక్రమ సంబంధం ఉంది ?

నా భర్తకు లేడీ లీడర్ తో అక్రమ సంబంధం ఉంది ?

అంతకు ముందు రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన సందర్బంగా రేష్మా పటేల్ బహిరంగంగా ఆయనకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలితో తన భర్త భగత్ సింగ్ సోలంకీకి అక్రమ సంబంధం ఉందని, ఆమె మోజులో పడిపోయిన తన భర్త తనను నిత్యం నరకం చూపిస్తున్నాడని రేష్మా పటేల్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆరోపించారు.

 నా మొగుడు కాలాంతకుడు

నా మొగుడు కాలాంతకుడు

తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తన విషయం బయటకు రాకుండా తన భర్త భగత్ సింగ్ సోలంకీ అనేక ప్రయత్నాలు చేశాడని ఆయన భార్య రేష్మా పటేల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలి మోజులో పడిపోయిన తన భర్త భగత్ సింగ్ సోలంకీ తనను చంపేస్తానని ఇప్పటికే ఆనేకసార్లు బెదిరించాడని ఆయన భార్య రేష్మా పటేల్ ఆరోపించారు.

 సోలంకీకి షాక్ మీద షాక్

సోలంకీకి షాక్ మీద షాక్

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భగత్ సింగ్ సోలంకీ మీద ఆయన భార్య రేష్మా పటేల్ గృహహింస కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే భగత్ సింగ్ సోలంకీ మీద వచ్చిన ఆరోపణలను ఆయన కాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని ఇంత వరకు ఖండించలేదని గుజరాత్ మీడియా అంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+