గుజరాత్ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల, మొదటి జాబితాలో నలుగురికి షాక్!
అమ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు 2017లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 13 మంది పేర్లు ఉన్నాయి. సీనియర్లను పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ 9 మంది కొత్త వారికి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించింది.

ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు 77 మందితో మొదటి జాబితాను విడుదల చేశారు. నిరసనలు, పటీదార్ వర్గం నాయకుల ఒత్తిడితో 77 మంది జాబితాలో నలుగురు అభ్యర్థులను పక్కన పెట్టి వేరే నాయకులకు అవకాశం కల్పించాలని భావించారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 86 మంది అభ్యర్థులను ప్రకటించింది.
గుజరాత్ లోని 89 శాసన సభ నియోజక వర్గాల్లో మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 9వ తేదీన జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి నవంబర్ 21వ తేదీ మంగళవారం చివరి రోజు కావడంతో మిగిలిన ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు.
-
రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, తొలి అస్త్రం - తాజా డిమాండ్..!! -
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!!












Click it and Unblock the Notifications