ఆవులకూ ‘ఆధార్’.. మొదలైంది! ప్రతి ఆవుకూ నంబర్‌, చెవుల్లో డిజిటల్ చిప్!

గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆధార్‌’ పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రారంభించింది. ప్రతి ఆవు చెవుల్లో ఐడీ నంబర్‌తో కూడిన డిజిటల్‌ చిప్‌లను

అహ్మదాబాద్‌: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 'ఆధార్‌' పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రారంభించింది. ప్రతి ఆవు చెవుల్లో ఐడీ నంబర్‌తో కూడిన డిజిటల్‌ చిప్‌లను ఏర్పాటు చేస్తోంది.

ఈ కార్యక్రమం కోసం గుజరాత్ రాష్ట్రమంతా టెక్నిషీయన్ల బృందాలను పంపించింది. తొలిదశలో భాగంగా.. 37 వేల ఆవులకు యునిక్‌ ఐడెంటినీ నంబర్‌లను కేటాయించనుంది.
ఆవుల ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్‌ చిప్‌లు ఉపయోగపడుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

Gujarat govt begins to create Aadhaar like UID for cows, implants chip in cattle's ear

ఈ డిజిటల్ చిప్‌ ఆధారంగా ఆవులు ఎక్కడికి వెళ్లాయో సులువుగా తెలుసుకోవచ్చని, అంతేగాక, గోవుల ఆర్యోగం గురించిన వివరాలు కూడా చిప్‌లు అందిస్తాయని పేర్కొంది. ఈ చిప్‌ల్లో ఆవులకు కేటాయించిన నంబర్‌, వాటి అడ్రసు, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌ పద్ధతిలో నమోదు చేస్తారు.

గోవధకు పాల్పడితే యావజ్జీవ శిక్ష!

తొలి దశ కింద రూ. 2.8 కోట్లు ఖర్చుచేసి 37 వేల ఆవులకు 'ఆధార్‌' నంబర్‌ ఇవ్వనున్నారు. గోహింస, గోవధను అరికట్టేందుకు కూడా అవసరమై చర్యలు తీసుకున్నారు. గోవధపై గత నెలలో గుజరాత్‌ ప్రభుత్వం సంచలన చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గోవధకు పాల్పడిన వారికి కనిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించే చట్టాన్ని గుజరాత్‌ అసెంబ్లీ ఆమోదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+