గుజరాత్ మున్సిపోల్స్: బీజేపీ అధికస్థానాల్లో గెలిచినా...
అహ్మదాబాద్: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే తలపిస్తున్నాయి. గత డిసెంబరులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ, వరుసగా ఆరోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతమైంది. బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోగా, కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీకి 47, కాంగ్రెస్‌కు 16, స్వతంత్రులు 4, ఎన్సీపీ, బీఎస్పీలు చెరొకటి గెలుచుకున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరేశ్ సిన్హా తెలిపారు.

ఆరు చోట్ల మాత్రం ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 మున్సిపాల్టీల్లో జయకేతనం ఎగురేసిన బీజేపీ ప్రస్తుతం 47కు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ తన స్థానాలను 13 నుంచి 16కు పెంచుకోగలిగింది.
గుజరాత్‌లోని 182 శాసనసభ స్థానాలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించగా, బీజేపీ 99, కాంగ్రెస్ 77 చోట్ల గెలుపొందాయి. బొటాబొటి మెజార్టీతో అధికారం హస్తగతం చేసుకున్న బీజేపీకి, ఈ విజయంతో చావుతప్పి కన్నులొట్టబోయింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది.
150 స్థానాలను టార్గెట్ చేసుకున్న బీజేపీకి మాత్రం భంగపాటు తప్పలేదు. 75 మున్సిపాల్టీలు, రెండు జిల్లా పరిషత్‌లు, 17 తాలూకాలు, 1400 గ్రామపంచాయితీలకు ఫిబ్రవరి 17న పోలింగ్ నిర్వహించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications