Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు!

గుజరాత్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈ సారి జరిగిన ఓ ఘటన మాత్రం ఓటర్లను, రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. దాహోద్ జిల్లా పంచాయతీలోని పిపెరో స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో భారత్ సింగ్ వఖాలా అనే అభ్యర్థి ఏకంగా మూడు ప్రధాన ప్రత్యర్థి పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆయన తన నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రాజకీయ ప్రస్థానం
సీనియర్ నేత బచుభాయ్ ఖాబాద్‌కు కంచుకోటగా భావించే పిపెరో సీటు ఇప్పుడు ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. భారత్ సింగ్ వఖాలాకు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన భారత్ సింగ్ వఖాలా.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి.. మళ్లీ ఆప్‌లోకి మారి.. ఇటీవల బీజేపీ గూటికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా నామినేషన్ల పరిశీలనలో ఆయన పేరు మూడు పార్టీల జాబితాలో ఉండటం గమనార్హం.

Gujarat Politics Candidate Bharat Singh Vakhala Files Nomination for BJP Congress and AAP

మూడు పార్టీల తరఫున నామినేషన్
పెపెరో స్థానానికి మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో భారత్ సింగ్ వఖాలా మూడు పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. బీజేపీ తరఫు దాఖలైన 5 దరఖాస్తుల్లో.. కాంగ్రెస్ తరఫున వచ్చిన 2 నామినేషన్లలో.. ఆప్ తరఫున దాఖలైన ఏకైక ఫామ్ ప్రకారం భారత్ సింగ్ వఖాలా అభ్యర్థిగా ఉండడం గమనార్హం. ఇలా మూడు ప్రధాన పార్టీలు సాంకేతికంగా ఒకే వ్యక్తిని తమ అభ్యర్థిగా కలిగి ఉండటం భారత ఎన్నికల చరిత్రలోనే అత్యంత అరుదైన, విచిత్రమైన విషయంగా చెప్పవచ్చు.

తుది నిర్ణయం ఎప్పుడు?
భారత్ సింగ్ వఖాలా మూడు పార్టీల తరఫున నామినేషన్ ఫారాలు సమర్పించినప్పటికీ.. చట్టబద్ధంగా ఆయన ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ పార్టీ ఇచ్చే అధికారిక 'మ్యాండేట్' (ఫారమ్ బీ)పై ఆధారపడి ఉంటుంది. గడువు ముగిసేలోపు ఏ పార్టీ అయితే అతనికి అధికారిక బీ-ఫామ్ అందజేస్తుందో, ఆ పార్టీ అభ్యర్థిగా మాత్రమే అతను గుర్తింపు పొందుతాడు. మిగిలిన నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి లేదా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.

ఓటర్లలో ఉత్కంఠ:
ఈ నెల 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉండటంతో.. ఆ రోజునే భారత్ సింగ్ వఖాలా అసలు ఏ పార్టీ జెండా పట్టుకుంటారో స్పష్టత రానుంది. అప్పటి వరకు పిపెరో నియోజకవర్గంలో ఈ "ట్రిపుల్ నామినేషన్" డ్రామా కొనసాగుతూనే ఉంటుంది. అనుభవజ్ఞుడైన నాయకుడు ఇలా మూడు పార్టీలను బురిడీ కొట్టించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+