వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత విద్యుత్ కాదు.. ఆదాయం పొందే సమయమిది: కేజ్రీవాల్‌కు మోడీ చురకలు

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ను ఉచితంగా పొందడానికి బదులు.. కరెంట్ నుంచి ఆదాయం పొందే సమయమిదని అన్నారు. విద్యుత్ నుంచి ఎలా సంపాదించాలో తనకు తెలుసన్నారు.

ఉత్తర గుజరాత్‌లోని ఆరావళి ప్రాంతంలోని మొదాసా పట్టణంలో రాజకీయ నిర్ణయ ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. అధికారంలో ఎలా ఉండాలనే దానిపైనే కాంగ్రెస్ శ్రద్ధ వహిస్తుందని, విభజించి పాలించు అనే సూక్తికి కట్టుబడి ఉందని ప్రధాని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

Gujarat polls: Time To Generate Income From Electricity Than Get It For Free, says PM Modi Takes Dig At Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌, దేశరాజధాని తరహాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలోనే "ఉచిత విద్యుత్‌ను అందించే ఈ మ్యాజిక్‌లో నైపుణ్యం సాధించిన ఏకైక రాజకీయ నాయకుడు తానేనని" కేజ్రీవాల్ అనేకసార్లు చెప్పుకోవడం గమనార్హం.

ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో
పేర్కొందని మోడీ గురువారం చెప్పారు. గుజరాత్‌లోని ప్రజలు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ల ద్వారా ఉత్పత్తి చేయబడిన అదనపు విద్యుత్‌ను ఉచితంగా పొందడం కంటే డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారని వివరించారు.

"మొధేరా గ్రామం (మెహసానా జిల్లాలో) ఇప్పుడు పైకప్పు సౌరశక్తితో ఎలా నడుస్తుందో మీరు తప్పక చూసి ఉంటారు. వారు తమ అవసరానికి అనుగుణంగా విద్యుత్తును ఉపయోగిస్తున్నారు. అంతేగాక, అదనపు విద్యుత్ (ప్రభుత్వానికి) విక్రయిస్తున్నారు. నేను గుజరాత్ అంతటా ఈ విధానాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాను' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

"ఈ వ్యవస్థలో, మీరు సోలార్ ప్యానెళ్ల నుంచి ఉత్పత్తి చేయబడిన అదనపు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ప్రజలు విద్యుత్ నుంచి సంపాదించగలిగే ఈ కళ మోడీకి మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు.

రూఫ్‌టాప్ సోలార్ పవర్‌ను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్తు మరింత సరసమైనదిగా మారిందని, అందుకే మొధేరాకు చెందిన ఒక మహిళ ఇప్పుడు రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్ కొనాలని యోచిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ జిల్లాలో రైతులు పోలీసుల కాల్పుల్లో మరణించారని ఆరావళి ప్రజలకు గుర్తు చేశారు మోడీ. రైతులు ఇప్పుడు తమ పొలాల్లోకి ప్రవేశించలేని ప్రదేశాలలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వారి స్వంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

మిగులు కరెంటును కూడా అమ్మి సొమ్ము చేసుకోవచ్చని, అందుబాటు ధరలో విద్యుత్ డిమాండ్ చేసే యుగం పోయిందని, నేడు కరెంటు అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చని అన్నారు.

'రాజస్థాన్ మీ సరిహద్దు దగ్గరే ఉంది, ఆ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కనిపించిందా?.. ఆ రాష్ట్రం నుంచి ఏదైనా శుభవార్త రావడం చూశారా.. కాంగ్రెస్ అభివృద్ధి చేయలేకపోతోంది' అని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

English summary
Gujarat polls: Time To Generate Income From Electricity Than Get It For Free, says PM Modi Takes Dig At Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X