వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాను తలపించిన కాల్పుల ఘటన

|
Google Oneindia TeluguNews

గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్‌లోని ఓ షాపింగ్‌మాల్ ఎదుట బుధవారం ఉదయం రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో ఓ అమాయక ఆటో డ్రైవర్ బలయ్యాడు. హత్య కేసులో అరెస్టయి జైలు నుంచి విడులైన వ్యక్తిని చంపేందుకు ఓ ముఠా ప్రయత్నించింది. కారులో వెళుతున్న అతడ్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది.

విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఆ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగకుండా డివైడర్‌పై నుంచి వెళ్లి మరో ఆటోపై పడింది. దీంతో ఆటోలో వున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్ణకు ఓ అమాయకుడు బలికాల్సి వచ్చింది.

మరో ముగ్గురికి కూడా ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా చూస్తున్న స్థానికులు సినిమా షూటింగా లేక, నిజంగానే జరుగుతుందా? అని నమ్మలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాల్పులకు పాల్పడిన నలుగురు నిందితులు అప్పటికే కారులో పరారయ్యారు. కాగా, గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Gunmen opened fire on an SUV near a big mall in Gurgaon this morning, causing the car to topple over onto an auto-rickshaw. The driver of the auto-rickshaw was killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X