వైద్యం కోసం వస్తే.. యువతిపై పలుమార్లు రేప్ చేశాడు

ఛండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసమని ఓ 19ఏళ్ల అమ్మాయిని తీసుకెళితే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 65ఏళ్ల తాంత్రికుడు. అంతకుముందు నిందితుడు పంచాయతీ సమితికి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించడం గమనార్హం. అంతేగాక, అతనికి ముగ్గురు భార్యలు, పది మంది పిల్లలు కూడా ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని, అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడు దీన్ మొహమ్మద్ అలియాస్ దీను, అతని సహాయకుడు దరాబ్ ఖాన్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు.
దీను 2002లో పంచాయతీ సమితికి ఛైర్మన్‌గా పని చేసినట్లు పోలీసులు చెప్పారు.

Gurgaon tantrik, father of 10, held for teen's rape

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 31, 2016న బాధితురాలిని ఆమె తల్లిదండ్రులు దీను వద్దకు తీసుకెళ్లారు. తమ కూతురుకు వచ్చిన వ్యాధిని నయం చేయాలని కోరారు. అయితే, వైద్యం పేరుతో దీను ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడు.

అంతేగాక, తన వద్దకు వచ్చిన ప్రతిసారి రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిన్హాలోని తాంత్రికుడి ఇంటికెళ్లి అతడ్ని, అతడి సహాకుడ్ని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+