• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుర్మీత్ మామూలోడు కాదు: నేతాజీపై సినిమా, అంతా సిద్దమయ్యాక ట్విస్ట్!

|

న్యూఢిల్లీ: రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గురించి ఆసక్తికర విషయాలు లీకవుతున్నాయి. రేప్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చడంతో జైల్లో ఉన్నాడే కానీ.. లేదంటే ఈపాటికీ మరో సినిమాతో బిజీగా ఉండేవాడట.

'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..

ఇప్పటికే ఎంఎస్‌జి-1, ఎంఎస్‌జి-2 సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై హల్‌చల్ చేసిన గుర్మీత్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంపై సినిమా తీయాలనుకున్నాడట. ఈ సినిమాతో బెంగాలీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించినట్లుగా తెలుస్తోంది.

గుర్మీత్ కన్నీళ్లు!: తీర్పు విని షాక్, ఆ సమయంలో బాబా మానసిక స్థితి ఇదీ!గుర్మీత్ కన్నీళ్లు!: తీర్పు విని షాక్, ఆ సమయంలో బాబా మానసిక స్థితి ఇదీ!

నేతాజీ మిస్టరీకి సంబంధించిన దృశ్యాలను తెరకెక్కిస్తే.. అదో సంచలనంగా మారుతుందని, తద్వారా మంచి బిజినెస్ కూడా జరుగుతుందని లెక్కలు కూడా వేసుకున్నాడట. కానీ అదే సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు 15ఏళ్ల క్రితం నాటి అత్యాచార కేసుకు సంబంధించి 20ఏళ్లు జైలు శిక్ష విధించడం డేరా బాబాకు అనూహ్య ట్విస్ట్.

సినిమా ఫైనలైజ్:

సినిమా ఫైనలైజ్:

సినిమాకు సంబంధించి ఆర్టిస్టుల జాబితా, హోటల్ బుకింగ్స్ కూడా ఫైనలైజ్ చేసే పనిలో ఉండగానే.. ఇలా జైలు బాట పట్టి ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చిందట. నేతాజీ సినిమా కోసం ఆయన కుటుంబ సభ్యులను సైతం కలిసి సలహాలు సూచనలు తీసుకోవాలని డేరా బాబా భావించాడట.

సినిమా విషయంలో సెన్సార్ బోర్డు నుంచి సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గకూడదని అనుకున్నారట.
అంతా అనుకున్నట్లే జరిగుంటే సెప్టెంబర్ కల్లా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఉండేదని తెలుస్తోంది.

హనీప్రీత్ కోసం కలవరింత:

హనీప్రీత్ కోసం కలవరింత:

ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా నిత్యం తన సహచరి హనీప్రీత్‌నే తలచుకుంటున్నట్లు చెబుతున్నారు. తన భార్యను కలిసేందుకు ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హనీప్రీత్‌తో పాటు ఆమె తల్లి నసీబ్ కౌర్‌ను కలుసుకోవాలని ఆరాటపడుతున్నాడట.

కుమారులు, కూతుళ్లను కలవాలని:

కుమారులు, కూతుళ్లను కలవాలని:

హనీప్రీత్‌తో పాటు కుమారుడు జస్మీత్, కుమార్తెలు చరణ్ ప్రీత్, అమర్ ప్రీత్, అల్లుళ్లు షాన్ ఏ మీత్, రూహ్ ఏ మీత్, డేరా చైర్మన్ విపాసన, అనుచరుడు దాన్‌సింగ్‌లను చూడాలనుకుంటున్నాడు. కాగా, దాన్ సింగ్ గతంలో డేరా ఆశ్రమంలోనే పనిచేసేవాడు.

హనీప్రీత్ తోనే ఎక్కువ సమయం:

హనీప్రీత్ తోనే ఎక్కువ సమయం:

అందరికన్నా హనీప్రీత్ తోనే డేరా బాబా ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన సినిమా వ్యవహారాలు కూడా ఆమెనే చూసుకునేవారు. ఆఖరికి హర్యానా సీబీఐ కోర్టు నుంచి డేరా బాబా బయటకు వచ్చిన సమయంలోను ఆయన్ను తప్పించడానికి ఆమె కుట్ర చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు.

English summary
Rape convict Gurmeet Ram Rahim Singh Insan made his foray in Bollywood with the MSG franchise, and if things had gone according to plan, he was looking to enter the Bengali film industry next.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X