Viral Video: మహిళా బైకర్ ను వెంటాడి వేటాడి మరీ ఢీకొట్టాడు.. ఎందుకంటే..?
హరియాణాలోని గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా బైకర్ ను కొందరు వ్యక్తులు తమ కారుతో కావాలనే ఢీకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా చెప్పుకుంటున్న కల్యాణ్ బైన్స్ లా అని పోలీసులు గుర్తించారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనలో నిందితుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
గురుగ్రామ్ లోని బిజీ రోడ్డుపై ఓ మహిళా బైకర్ తన స్పోర్ట్స్ బైక్ పై ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెళ్తోంది. అయితే రోడ్డుపై వెళ్తున్న ఆమెను చూసిన కారులోని కొందరు వ్యక్తులు వెంబడించారు. దీంతో ఆమె వారిని వారించింది. ఎందుకు ఫాలో చేస్తున్నారని మండిపడింది. దాంతో కోపం పెంచుకున్న ఆ గ్యాంగ్ ఆమె మాటలు పట్టించుకోకుండా అలాగే ఫాలో అవుతూ రోడ్డుపై న్యూసెన్స్ చేసింది. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఆమె బైకును కారులోని వ్యక్తి ఢీకొట్టాడు. బైకర్ కిందపడటంతో ఏమీ పట్టించుకోకుండా అలాగే స్పీడుగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మహిళా బైకర్ తన బైక్ కు అమర్చిన కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలో ఆ కారు నడిపిన వ్యక్తి కావాలని ఢీకొన్నట్లుగా స్పష్టంగా ఉంది.
You got to book this car driver under “hit and run” case @gurgaonpolice. Bring them to justice.
— Yo Yo Funny Singh (@moronhumor) September 14, 2026
Car No: HR 30Y 4949
📹: IG/rebelwheels_sia_ pic.twitter.com/KngHxTZ5ke
కిందపడిన మహిళా బైకర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. ఇక ఈ వీడియోను బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడి కోసం గాలించారు. అతను కల్యాణ్ బైన్స్ లా గా గుర్తించారు. అయితే కల్యాణ్ బైన్స్ లా తన ఇన్ స్టా అకౌంట్ లో తనను తాను అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడని.. భారత రగ్బీ జట్టు సభ్యుడు అని పేర్కొన్నట్లు వెల్లడైంది. ఇక ఈ వీడియో వైరల్ అయిన వెంటనే కల్యాణ్ బైన్స్ తన సోషల్ మీడియా ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు సమాచారం.

ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కల్యాణ్.. తాను కావాలని మహిళా బైకర్ ను ఢీకొట్టలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
