సీబీఐ విచారణకు సహకరిస్తా, మంత్రి, ప్రతిపక్షాల కుట్ర, నేను అమాయకుడిని. అరెస్టు!
చెన్నై: గుట్కా స్కామ్ కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖా మంత్రి సీ. విజయ్ భాస్కర్ అన్నారు. గుట్కా స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రతిపక్షాలు కుట్రపన్నాయని, నేను అమాయకుడు అని మంత్రి సీ. విజయ్ భాస్కర్ అంటున్నారు. గుట్కా స్కామ్ కేసులో సీబీఐ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు.

షాక్ ఇచ్చిన సీబీఐ
సీబీఐ అధికారులు చెన్నై నగరంలోని మంత్రి సీ. విజయ్ భాస్కర్, డీజీపీ టీకే. రాజేంద్రన్, రిటైడ్ ఐపీఎప్ అధికారి ఎస్. జార్జ్ నివాసంతో పాటు 40 ప్రాంతాల్లో బుధవారం ఏక కాలంలో సోదాలు చేశారు. ఈ సందర్బంగా అనేక కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చట్టం అందరికీ సమానం
సీబీఐ దాడుల విషయంపై మంత్రి విజయ్ భాస్కర్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకే తమ మీద కేసు నమోదు చేసిందని, మద్రాసు హైకోర్టు కేసు సీబీఐకి బదిలి చేసిందని మంత్రి విజయ్ భాస్కర్ అన్నారు. చట్టం అందరికీ సమానం అని, సీబీఐ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని మంత్రి విజయ్ భాస్కర్ చెప్పారు.

సీబీఐకి హైకోర్టు ఆదేశం
డీఎంకే పార్టీ నాయకులు దాఖలు చేసిన కేసు వివరాలు తెలుసుకున్న మద్రాసు హైకోర్టు కేసు విచారణ చెయ్యాలని 2018 ఏప్రిల్ నెలలో ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ఎక్సైజ్ శాఖ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల మీద అవినీతి ఆరోపణల కేసు నమోదు చేసింది.

హోల్ సేల్ వ్యాపారి
2013లో తమిళనాడు ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలాను నిషేధించింది. అయినా తమిళనాడులో జోరుగా గుట్కా వ్యాపారం జరిగింది. గతంలో ఐటీ శాఖ అధికారులు గుట్కా హోల్ సేల్ వ్యాపారి మాధవరావ్ కు చెందిన గౌడన్ మీద దాడి చెయ్యడంతో అక్కడ వారికి ఓ డైరీ చిక్కింది.

డైరీలో జాతకాలు
ఒక మంత్రితో పాటు ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వంలోని అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులకు ఏ తేదీలో ఎంత ముడుపులు ఇచ్చారు అని పూర్తి వివరాలు డైరీలో ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. గుట్కా విక్రయించడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా దాదాపు రూ. 40 కోట్లు ముడుపులు ఇచ్చినట్లో డైరీలో ఉండటంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications