Gyanvapi: హిందూ మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారు: సర్వే రిపోర్టులో సంచలనాలు

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌ కాశీలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించి ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదు కింద అతి పెద్ద హిందూ ఆలయం ఆనవాళ్లను గుర్తించినట్లు ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడైందని హిందూపక్షం న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ తెలిపారు.

నిర్మాణం కింద 34 శాసనాలను ఏఎస్‌ఐ సర్వేలో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 32 ముద్రికలను కూడా ఏఎస్‌ఐ సర్వేలో భాగంగా కనుగొన్నట్లు న్యాయవాది విష్ణుశంకర్‌ వివరించారు. నిర్మాణ సమయంలోనూ శాసనాలు వాడినట్లు సర్వేలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు.

Gyanvapi Case: Archaeological Report Reveals Hindu Temple Existed Before Mosque

తెలుగు సహా దేవనాగరి, గ్రంథ, కన్నడ భాషల్లో శాసనాలున్నట్లు న్యాయవాది విష్ణుశంకర్​ వివరించారు. గతంలో ధ్వంసమైన నిర్మాణ భాగాలు మళ్లీ వాడినట్లు సర్వేలో బయటపడిందని ఆయన అన్నారు. శాసనాలపై జనార్దన, రుద్ర, ఉమేశ్వర దేవతల పేర్లనూ ఏఎస్​ఐ నిర్వహించిన సర్వేలో గుర్తించినట్లు విష్ణుశంకర్ తెలిపారు.

మసీదునునిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ఏఎస్ఐ రిపోర్టు ప్రకారం.. గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వే చేశారని, సైట్‌లో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లు తెలుస్తోందని.. ప్రస్తుత నిర్మాణం ముందుగా ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందనే విషయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.

17వ శతాబ్దంలో హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించనిట్లు వివిరంచారు. కాగా, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే రిపోర్టును ఇరు పక్షాలకు ఇవ్వాలని బుధవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసందే. ఈ రిపోర్టును బహిరంగపర్చాలని కోర్టు తెలిపింది. కాగా, హిందూ ఆలయం ఉందని తేలడంతో హిందూ వర్గం పిటీషనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి సర్వే జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+