ప్రేమ పెళ్లి పేరుతో రేప్, వేరే యువతితో నిశ్చితార్థం, పెళ్లి ఫిక్స్: చివరికి పెళ్లి కొడుకు ఎక్కడంటే
బెంగళూరు: పెళ్లి ఫిక్స్ అయ్యింది. యువతితో యువకుడి నిశ్చితార్థం జరిగిపోయింది. యువతి, యువకుడు కొత్త జీవితం గడపాలని కలలు కంటున్నారు అయితే సినిమా ఫక్కీలో వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలో జరిగింది.
మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని గర్బవతిని చేసి మోసం చేసిన గౌతమ్ (31) అనే యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. యువకుడి మీద అత్యాచారం చేసి మోసం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దోడ్డబళ్లాపురలోని కోర్టు వీదిలో గౌతమ్ నివాసం ఉంటున్నాడు.

దోడ్డబళ్లాపురలో అకౌంటెంట్ విద్యార్థి అయిన యువతి 2018లో బుల్లెట్ జిమ్ లో చేరింది. అదే జిమ్ లో గౌతమ్ కోచ్ గా పని చేస్తున్నాడు. జిమ్ కు వెలుతున్న యువతితో గౌతమ్ పరిచయం చేసుకున్నాడు. యువతికి గత సంవత్సరం వివాహం అయ్యింది.
సంవత్సరం నుంచి యువతి భర్తకు దూరంగా ఉంటున్నదని గౌతమ్ తెలుసుకున్నాడు. యువతితో పరిచయం పెంచుకున్న గౌతమ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. యువతికి దగ్గర అయిన గౌతమ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన గౌతమ్ జిమ్ లోనే ఆమె మీద అత్యాచారం చేశాడని సమాచారం. యువతి గర్బవతి కావడంతో గౌతమ్ ఆమెకు దూరం అవ్వడానికి ప్రయత్నించాడు. గౌతమ్ దూరం అవుతున్నాడని గుర్తించిన యువతి అతని తండ్రితో మాట్లాడింది.
పెళ్లి చెయ్యడానికి గౌతమ్ తండ్రి నిరాకరించాడు. గౌతమ్ తండ్రి భాదితురాలిని తెలిసిన వారి ఇంటిలో పెట్లాడు. అక్కడికి వెళ్లిన గౌతమ్ ఆమె మీద అత్యాచారం చేశాడు. మే 8వ తేదీన గౌతమ్ కు వేరే యువతితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. విషయం తెలుసుకున్న భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిశ్చితార్ధం చేసుకుని వేరే యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన గౌతమ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications