వైద్యురాలికి పోర్నోగ్రాఫిక్ క్లిప్స్ పంపిన జిమ్ ట్రైనర్: అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. గత కొంత కాలంగా వైద్యురాలికి అసభ్య సందేశాలను పంపించిన సల్లూ ముజావర్, ఆ తర్వాత నగ్న చిత్రాలను, వీడియో క్లిప్‌లను పంపించడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 24న సాయంత్రం 5 గంటలకు ఓ పోర్నోగ్రాఫిక్ క్లిప్‌ను నిందితుడు సల్లూ వైద్యురాలికి పంపించాడు. దీంతో ఆ వైద్యురాలు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపి, బాంద్ర పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు ముజావర్‌పై ఐపిసి సెక్షన్ 354 (ఏ), ఐటి చట్టం 67, 67(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సల్లూకు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని సమన్లు జారీ చేశామని చెప్పారు. నిందితుడు తమకు లొంగిపోకపోవడంతో అతన్ని గాలించి పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 27న సల్లూను పట్టుకున్న పోలీసులు, మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. రెండోసారి వాదనలు వినేంత వరకు నిందితునికి జ్యుడీషియల్ కస్టడీని విధించింది. నిందితునికి సంబంధించిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications