వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి హెఎల్ దత్తు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటకకు చెందిన దత్తు నియామకానికి సంబంధించి విశ్వసనీయ ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ బుధవారం మీడియా కధనాలు వెలువడ్డాయి.

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా హెచ్‌ఎల్ దత్తు పేరును సిఫార్సు చేస్తూ ఓ ఫైలును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపినట్టుగా ఈ కథనాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న దత్తు 27న పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎమ్.లోధా స్థానంలో నియమితమవుతారు.

కేరళ గవర్నర్‌గా సదాశివం నియామకం

H.L. Dattu to be next Chief Justice of India

న్యూఢిల్లీ: అనేక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే మొదటిసారి.

అంతేకాదు, ఇప్పటి వరకూ రాజకీయాలతో సంబంధం ఉన్న వారినే గవర్నర్‌లుగా నియమిస్తున్న తరుణంలో రాజకీయాలకు అతీతమైన వ్యక్తిగా సదాశివం ఈ పదవిలో నియమితమయ్యారు. కేరళ గవర్నర్‌గా షీలాదీక్షిత్ రాజీనామాను రాష్టప్రతి ప్రణబ్ ఆమోదించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. సదాశివం నియామకంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అమిత్ షా విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు కారణంగానే ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందా అంటూ ప్రశ్నించింది.

English summary
President Pranab Mukherjee has cleared the appointment of Justice H.L. Dattu, the senior-most judge in the Supreme Court, as the 42nd Chief Justice of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X