హ్యాకింగ్‌కు గురైన బీజేపీ వెబ్‌సైట్.. ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్ర పోస్టులు
ఢిల్లీ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఎన్నికల వేళ బీజేపీ సైట్ హ్యాకింగ్ కు గురికావడం చర్చానీయాంశంగా మారింది. బీజేపీ వెబ్‌సైట్ హ్యాకింగ్ కు గురైందంటూ కొందరు నెటిజన్లు చెబితే గానీ విషయం బయటకు పొక్కలేదు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన సదరు సైట్ నిర్వాహకులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మేమ్స్ తో బీజేపీ వెబ్‌సైట్ లో హ్యాకర్లు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. సోదరసోదరిమణులారా మీ అందర్నీ నేను ఫూల్స్ ను చేశాను అనే మేమ్స్ దర్శనమివ్వడం పార్టీశ్రేణులను కలవరానికి గురిచేసింది. ఇంకా ఇలాంటి మేమ్స్ చాలా రానున్నాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.

కొందరు వాటి తాలూకు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బీజేపీ సైట్ నిర్వాహకులు స్పందించారు. వెంటనే దాన్ని నిలిపివేశారు. బీజేపీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రస్తుతం మెయింటెనెన్స్ లో ఉందనే సందేశం తెరపై కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో కూడా బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఛత్తీస్ గఢ్ బీజేపీకి చెందిన వెబ్‌సైట్ లోకి హ్యాకర్లు చొచ్చుకొచ్చారు. ఆ సైట్ లో పాకిస్థాన్ జెండా కనిపించడం చర్చానీయాంశమైంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications