వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్ జీహాద్: హిందూ పేరుతోనే హదియా వైద్య విద్య పూర్తి, భర్తతో భేటీకి ప్రిన్సిపాల్ నో !

|
Google Oneindia TeluguNews

సేలం/చెన్నై: కేరళ లవ్ జీహార్ వ్యవహారంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన అఖిల అశోకన్ అలియాస్ హదియా (25) హిందూ పేరుతోనే వైద్య విద్య పూర్తి చేస్తుందని సేలంలోని శివరాజ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ జీ. కన్నన్ మీడియాకు చెప్పారు. చదవు మధ్యలో ఆమె పేరు మార్చడం కుదరదని ప్రిన్సిపాల్ కన్నన్ అన్నారు.

హదియాగా పేరు, మతం మార్చుకున్నా కాలేజ్‌ రికార్డుల్లో మాత్రం ఆమె పేరు అఖిల అశోకన్‌ గానే తాము గుర్తిస్తామని ప్రిన్సిపాల్ కన్నన్ చెప్పారు. హదియాను ఆమె తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు తాము అవకాశం ఇస్తామని, ఆమె భర్తతో సహ ఇతరులు ఎవ్వరూ ఆమెను కలవడానికి అనుమతి ఇవ్వమని కాలేజ్ ప్రిన్సిపాల్ కన్నన్ అన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హదియా సేలంలోని శివరాజ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ లో తన వైద్య విద్యను కొనసాగించేందుకు కేరళ పోలీసుల భద్రతతో సేలం చేరుకుంది. సేలం చేరుకున్న హదియా కాలేజ్ ఉన్నతాధికారులను కలిసి తాను చదువును కొనసాగిస్తానని మనవి చేసింది.

నా భర్తను కలవాలి !

నా భర్తను కలవాలి !

శివరాజ్ హోమియోపతి మెడికల్ కాలేజ్‌ పరిసరాల్లో తన భర్త షఫీన్‌ జహాన్‌ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని హదియా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ కన్నన్ కు మనవి చేశారు. అయితే కాలేజ్ ఉన్నతాధికారులు అందుకు నిరాకరించారు. హదియా తన తల్లిదండ్రులను మాత్రమే కలవాలని ఆంక్షలు విధించారు.

ఇది ఇల్లు కాదు కాలేజ్ !

ఇది ఇల్లు కాదు కాలేజ్ !

కేరళకు చెందిన అఖిల అశోకన్‌ అలియాస్ హదియా సేలంలోని శివరాజ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ లో చదువుతోంది. నాలుగున్నరేళ్లు చదివిన అనంతరం అఖిల అశోకన్ కు షబ్బీన్‌ జహాన్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. షబ్బీన్ జహాన్ ను అఖిల అశోకన్ ను ప్రేమించింది.

 మతం, పేరు మార్చుకుంది

మతం, పేరు మార్చుకుంది

షబ్బీన్ జహాన్ అనే యువకుడిని పెళ్లిచేసుకున్న అఖిల అశోకన్ తరువాత ఆమె మతం మార్చుకుని తన పేరును హదియాగా మార్చుకుంది. తల్లిదండ్రులను ఎదిరించిన హదియా భర్తతోనే తాను ఉంటానని పట్టుబట్టింది. నాకు భర్త తప్పా ఎవ్వరూ వద్దని తేల్చి చెప్పింది.

 కోర్టు పెళ్లి రద్దు చేసింది

కోర్టు పెళ్లి రద్దు చేసింది

అఖిల అశోకన్‌ మతం, పేరు మార్చుకోవడం వెనుక కుట్ర ఉందని, ఇది లవ్ జీహాద్ అని, ఆమెను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేర్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అఖిల అశోకన్ పెళ్లి చట్టపరంగా చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. .

కోర్టు తీర్పును సవాలు చేసిన భర్త

కోర్టు తీర్పును సవాలు చేసిన భర్త

కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ అఖిల అశోకన్ అలియాస్ హదియా భర్త షబ్బీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ చేసిన సుప్రీం కోర్టు ముందు హదియాను విద్యను కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సమర్పించాలని ఎన్‌ఐఏ అధికారులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 ఉగ్రవాదిని అల్లుడు చేసుకోవాలా ?

ఉగ్రవాదిని అల్లుడు చేసుకోవాలా ?

సుప్రీం కోర్టు తీర్పుపై అఖిల అశోకన్ అలియాస్ హదియా తండ్రి అశోకన్ హర్షం వ్యక్తం చేశారు. మా కటుంబంలోకి ఒక ఉగ్రవాదిని చేర్చుకోవాలా, అందుకు మేము సిద్ధంగా లేమని, ఎన్ఐఏ అధికారులు అతని అసలు బండారాన్ని బయట పెడుతారనే నమ్మకం మాకుందని అశోకన్ మీడియాతో అన్నారు.

English summary
Hadiya, a Kerala woman at the centre of an alleged love-jihad case after converting to Islam, arrived here to continue studies at a homeopathy medical college as directed by the Supreme Court. College Principal G Kannan said she would continue her course under her Hindu name Akhila Ashokan.కేరళ లవ్ జీహార్ వ్యవహారంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన అఖిల అశోకన్ అలియాస్ హదియా (25) హిందూ పేరుతోనే వైద్య విద్య పూర్తి చేస్తుందని సేలంలోని శివరాజ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X