Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండిగో విమానాల్లో ఆ మాంసం వడ్డిస్తున్నారట.. ట్విటర్‌లో క్యాంపెయిన్ వైరల్

ప్రముఖ లోబడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే ఆ సంస్థ సహవ్యవస్థాపకుల మధ్య విబేధాల మధ్య సంక్షోభంలోకి వెళ్లిపోయిన ఇండిగో సంస్థ తాజాగా ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారి కొత్త సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడింది. ఇంతకీ ఏమిటి ఆ ట్వీట్ ..?

విమానంలో వడ్డిస్తున్న హలాల్ చేసిన మాంసాహారం

విమానంలో వడ్డిస్తున్న హలాల్ చేసిన మాంసాహారం

ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ విమానాల్లో వడ్డించే మాంసం ప్యాకెట్‌పై "ఇది హలాల్ చేసిన మాంసం" అని రాసి ఉండటంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.హలాల్ చేసిన మాంసం వడ్డించడమేంటని చెబుతూ ట్విటర్‌లో ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇండిగో విమానాలను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మెనూ కార్డులో ఇలా రాసి ఉంది." ఈ విమానంలో వడ్డించే మాంసాహారపు స్నాక్స్ అన్ని హలాల్ చేసిన మాంసంతోనే తయారుచేయబడినవి" అని రాసి ఉంది. అయితే గతకొన్నేళ్లుగా హలాల్ చేసిన మాంసాహార పదార్థాలనే విమానంలో వడ్డిస్తుండగా కొంత మంది ప్రయాణికులకు ఇప్పుడే అది సమస్యగా మారింది.

హిందువులు సిక్కుల మనోభావాలు దెబ్బతీసింది

ట్విటర్‌లో క్యాంపెయినింగ్ ప్రారంభం కాగానే చాలామంది నెటిజెన్లు స్పందించారు. హలాల్ చేసిన మాంసం వడ్డించడం ద్వారా హిందువులు సిక్కుల మనోభావాలను ఇండిగో యాజమాన్యం దెబ్బతీసిందంటూ తమ అభిప్రాయాన్ని తెలిపారు. హలాల్ చేసిన మాంసాహార పదార్థాలను ఇండిగో విమానాల్లో నిషేధించండి లేదంటే హిందువుల నుంచి నిషేధం ఎదుర్కొంటారని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. తను ఇండిగోలో తరుచూ ప్రయాణిస్తూ ఉంటానని చెప్పుకొచ్చిన ప్రయాణికుడు ఇక ఇండిగోలో ప్రయాణించే విషయమై ఆలోచించాలని అన్నాడు.

 విమానాయానశాఖ మంత్రిగా మీరు ఇండిగో చర్యను సమర్థిస్తారా..?

విమానాయానశాఖ మంత్రిగా మీరు ఇండిగో చర్యను సమర్థిస్తారా..?

మరో వ్యక్తి తన ట్వీట్‌ను పౌరవిమానాయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ట్యాగ్ చేశాడు. ఇండిగోలో హలాల్ చేసిన మాంసాన్ని వడ్డించడాన్ని మీరు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. హలాల్ చేసిన మాంసాన్ని హిందువులు, సిక్కులు ఎలా తింటారని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు హిందువులకు హలాల్ చేసిన మాంసం వడ్డించి కార్పోరేట్ సంస్థలు పెద్ద నేరమే చేస్తున్నాయని మరో వ్యక్తి మండిపడ్డాడు. ఇది హిందు మతానికి వ్యతిరేకం అని అన్నాడు.

 హలాల్ అంటే ఏమిటి..?

హలాల్ అంటే ఏమిటి..?

హలాల్ అంటే అరబిక్ భాషలో అనుమతి అని అర్థం. ఇస్లాం చట్టాల్లో హలాల్ అనే పదం కనిపిస్తుంది. జంతువులను ఇస్లాం పద్ధతిలో వాటి గొంతును కోసి చంపేస్తారు. జంతువులను వధించే సమయంలో అవి ఆరోగ్యకరంగా ఉండాలని ఇస్లాం చట్టాలు చెబుతున్నాయి. జంతవు గొంతు కోసిన తర్వాత రక్తం కారుతున్న సమయంలో ముస్లింలు ఓ మంత్రాన్ని జపిస్తారు. తమకు ఎలాంటి పాపం తెలియదని చెప్పేందుకు ఇలా హలాల్ చేసి ఒక జీవిని వధిస్తారు. దీన్నే హలాల్ అంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+