హమాస్ దాడులు ఉగ్ర చర్యే: పాలస్తీనా స్వతంత్రపై భారత్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. పాలస్తీనా(Palestine) స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపింది. అయితే, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఉగ్రచర్యగా భావిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి భారత్ విధానాన్ని తెలియజేశారు.
'ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుత చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది' అని బాగ్చి పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ (Israel), గాజా (Gaza)లో ఇరువర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు భారత్.. ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌ను ప్రకటించింది.
భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధం గత దశాబ్దంలో లేదా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం చట్రంలో వికసించింది. ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక, భారతదేశం అత్యంత విశ్వసనీయమైన రక్షణ, భద్రతా భాగస్వాములలో ఇజ్రాయెల్ ఒకటి.
కాగా, ఇజ్రాయెల్‌పై గత కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా దాడి చేసి అనేక మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు బలి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ ఉగ్రవాదుల వేట కొనసాగిస్తోంది. హమాస్ పై భీకర దాడులకు దిగుతోంది. హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులతో ఇరువైపులా వేలాది మంది మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు.












Click it and Unblock the Notifications