డేరా ఆశ్రమంలో అలా జరిగేది: రాత్రి 2గం. దాకా, హన్సరాజ్ చెప్పిన కొత్త విషయం..
డేరాలో జరిగే దీపావళి వేడుకల్లో ప్రతీది హనీప్రీత్ కనుసన్నుల్లో జరిగేదని చెప్పారు.
రోహ్‌తక్: డేరా సామ్రాజ్యంలో విచ్చలవిడి నేరాలకు పాల్పడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్‌కు సంబంధించి ఏదో ఒక కొత్త విషయం తెర పైకి వస్తూనే ఉంది. దీపావళి పండుగ నేపథ్యంలో డేరాలో వేడుకలకు సంబంధించిన వార్త ఒకటి తాజాగా వెలుగుచూసింది.
డేరా సచ్చాసౌదాలో గతంలో ఆశ్రయం పొందిన హంస్‌రాజ్ తాజాగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. డేరాలో జరిగే దీపావళి వేడుకల్లో ప్రతీది హనీప్రీత్ కనుసన్నుల్లో జరిగేదని చెప్పారు. వేడుకలు ప్రారంభమయ్యే సమయంలో.. ఆశ్రమంలోని యువతులంతా పాత్రలలో దీపాలు వెలిగించి.. ద్వారం వద్ద గుర్మీత్‌కు స్వాగతం చెబుతున్నట్లుగా నిలుచుంటారని పేర్కొన్నారు.

అనంతరం గుర్మీత్ బాబా ఆ దీప కాంతుల నడుమ హుందాగా నడుచుకంటూ వచ్చేవాడని గుర్తుచేశారు. అలా దీపావళి వేడుకలు మొదలయ్యేవని, ఈ వేడుకల్లో సాధ్వీలు, సాధువులు, డేరాలోని స్కూలు, కాలేజీకి చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనేవారన్నారు.
రాత్రి 2గం. వరకు యువతుల మధ్య బాబా ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొనేవాడని అన్నారు. దీపావళి సందర్బంగా గుర్మీత్ బాబా.. ప్రతీ ఏటా తన ఫోటోలతో కూడిన క్యాలెండర్ కూడా ఆవిష్కరించేవాడు. దీపావళి సందర్భంగా డేరా ఆశ్రమంలో కొన్ని లక్షల దీపాలు వెలిగించేవారు. అలాగే ఆశ్రమంలో భారీ ఎత్తున టపాసులు కాల్చేవారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications