• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హ్యాపీ బర్త్ డే మమ్మీ .. ఇక సెలవు, బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడు

|

నాగ్‌పూర్ : చిన్న వయస్సు .. అప్పుడే కొలువు వచ్చింది. అయితే అంతలోనే మాయారోగం వచ్చింది. గత రెండువారాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఏమైందో ఏమో తెలియదు. మానసిక ఒత్తిడో ... ఏ సంఘర్షణో తెలియలేదు. కానీ 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన కలవరానికి గురిచేస్తోంది.

బలవన్మరణం ..

మంతన్ మహేంద్ర చావన్. వయస్సు 19 ఏళ్లు. కానీ గో ఎయిరో సంస్థలో ట్రైనీ ర్యాంప్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు. కానీ నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని చనిపోయాడు. అంతకుముందు తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖ రాశాడు. తన ఇంట్లోని వెంటిలెటర్ రాడుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 2.45 గంటలకు ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

‘Happy birthday mummy, I’m sorry’: GoAir employee hangs himself after wishing mother

కారణమిదేనా ?

మహేంద్రన్ గత రెండువారాల నుంచి సెలవులో ఉన్నాడు. అతనికి పచ్చకామెర్లు రావడంతో రెండు వారాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడని అతని తండ్రి చెప్పినట్టు పోలీసు అధికారి మగర్ పేర్కొన్నారు. మహేంద్రన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని .. కానీ తన తల్లికి బర్త్ డే విష్ చేసిన చిన్న లేఖ మాత్రం ఘటనాస్థలంలో ఉందని తెలిపారు. నన్ను క్షమించు అమ్మ .. పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి ఉందని వివరించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేశారు. చావన్ తల్లి నాగ్ పూర్ స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్నారు.

మహేంద్రన్ మ‌ృతిపై గో ఎయిర్ సంస్థ కూడా స్పందించింది. అతని మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపింది. కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరింది. గత 9 నెలల నుంచి తమ వద్ద పనిచేస్తున్నాడని పేర్కొంది. అనారోగ్య సమస్యతో గత వారం నుంచి ఆఫీసుకు రావడం లేదని .. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చింది గో ఎయిర్ సంస్థ. తమ సంస్థ నుంచి రావాల్సిన వేతనం, పీఎఫ్, ఇతర అలవెన్సులు చెల్లిస్తామని స్పష్టంచేసింది. అయితే 19 ఏళ్ల వయస్సులోనే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కామెర్ల వ్యాధితో బాధపడుతూ చనిపోయాడా ? లేదంటే వర్క్ ప్రెషర్ కు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 19-year-old employee of private carrier GoAir here has allegedly committed suicide, a step he took after wishing his mother on her birthday, police said Friday. The deceased, Manthan Mahendra Chavan, was part of the Mumbai-headquartered budget airline’s ground staff at the Nagpur airport, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more