Holi 2023: హోలీ ఏ రోజు?: క్యాలెండర్ లో ఒకలా

హోలీ పండగ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ పండగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమౌతున్నారు. హోలీ తేదీపై కొంత గందరగోళం నెలకొంది.

న్యూఢిల్లీ: హోలీ పండగ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ పండగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమౌతున్నారు. హోలికా పౌర్ణమి నాడు కామదహనంతో ఈ వేడకలు ఆరంభమౌతాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయంలో ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఒకే రోజున ఈ పండగ వేడుకల్లో పాల్గొనకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హోలీ తేదీపై కొంత గందరగోళం నెలకొంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయాల ప్రకారం- వేర్వేరు తేదీల్లో హోలీని జరుపుకొంటుంటారు. ఈ పండగలో అతి ప్రధానమైన కామదహన కార్యక్రమం ఏ రోజున నిర్వహిస్తారనే విషయంపై కొంత భిన్నవాదనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు రెండు రోజుల పాటు హోలిని జరుపుకొంటాయి. తొలి రోజు హోలికా దహన్, రెండో రోజు మహారాష్ట్రలో ధూళివందన్ అని పిలుస్తారు.

Happy Holi: When is Holi 2023 date? March 7 or 8? Check the details here

క్యాలెండర్ ప్రకారం- ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును హోలీకా పౌర్ణమిగా భావిస్తారు. హోలికా అనే అసురుడిని దహనం చేసిన రోజు కావడం వల్ల దానికి గుర్తుగా అదే రోజున ఈ పండగను జరుపుకుంటారు. హోలికా దహన్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రాత్రి జరుగుతుంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో హోలికా దహన్ కార్యక్రమాన్ని ఛోటీ హోలీ, ధులండిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

దక్షిణాది రాష్ట్రల్లో కూడా రెండురోజుల పాటు హోలీ పండగ వేడుకలను నిర్వహిస్తారు. తన తపస్సును భగ్నం చేశాడనే కారణంతో త్రినేత్రంతో మన్మథుడిని భస్మం చేసిన రోజుకు గుర్తుగా దక్షిణాది రాష్ట్రాలవారు హోలీ పండగను జరుపుకొంటుంటారు. ఒక్కరోజు ఒక్కో సంప్రదాయంలో, ఒక్కో రాష్ట్రంలో వేర్వేరుగా హోలీ పండగను జరుపుకోవడం వల్ల తేదీల్లో గందరగోళం నెలకొందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి ఈ సాయంత్రం 4:17 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మంగళవారం సాయంత్రం 6:09 నిమిషాలకు ముగుస్తుంది. కాగా పౌర్ణమి తిథి రేపటితో ముగియనున్నందున ఆ రోజు సాయంత్రం నుంచి హోలికా దహన్ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ మరుసటి రోజు అంటే 8వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+