రైల్వే స్టేషన్‌లో వెరైటీగా New Year 2025 సెలబ్రేషన్స్: మోత మోగిపోయిందంతే

Happy New Year 2025: కొత్త ఏడాది ఆరంభమైంది. 2025లోకి అడుగు పెట్టాయి ప్రపంచదేశాలు. ఒక్కో దేశం ఒక్కో విధంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటోన్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కోట్లాదిమంది మేల్కొనే ఉన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు.

అర్ధరాత్రి 12 గంటలు కాగానే దేశవ్యాప్తంగా కొత్త ఏడాది ఉత్సవాలు మిన్నంటాయి. బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు జనం. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ.. వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. కేక్ కట్ చేస్తూ కోలాహలంగా గడిపారు ప్రజలు.

Happy New Year 2025 All trains honking together at 12 midnight at Mumbai CSMT

కొత్త ఏడాదిని పురస్కరించుకుని భక్తులు ఆలయాలను సందర్శిస్తోన్నారు. పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఈ క్రమంలో గడ్డ కట్టించే చలిని సైతం లెక్క చేయట్లేదు. తెల్లవారు జాము నుంచే గుడుల ముందు బారులు తీర్చి నిల్చొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తోన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయం, అయోధ్య రామమందిరం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి దేవస్థానం, ఒడిశాలోని పూరీ జగన్నాథుడు, తమిళనాడులోని మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. తెల్లవారు జాము నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు జనం. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తోన్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ముంబైలోని ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లో జరిగిన కొత్త ఏడాది వేడుకలు మరో ఎత్తుగా కనిపించాయి. రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది.. ప్రయాణికులతో కలిసి విభిన్నంగా, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు.

రైల్వే స్టేషన్‌లో గల డిజిటల్ క్లాక్.. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే.. ఒక్కసారిగా అక్కడ ఉన్న రైళ్ల హారన్లను మోగించారు లోకో/ఎలక్ట్రిక్ ఇంజిన్ పైలెట్లు. రెండు నిమిషాల పాటు ఏకధాటిగా అలా హారన్ మోగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ప్రయాణికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. దీన్ని తమ మొబైల్ ఫోన్లల్లో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+