అసభ్య ప్రవర్తన: చేయి తోసేసి.. నగ్మా ఆగ్రహం (పిక్చర్స్)
లక్నో: ప్రముఖ నటి, ఉత్తర ప్రదేశ్‍లోని మీరట్ లోకసభ నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నగ్మా పట్ల అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనతో నగ్మా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్యే చర్యను మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
హపూర్ వచ్చిన నగ్మాను స్థానిక ఎమ్మెల్యే గజరాజ్ ఆహ్వానించారు. ఈ సమయంలో ఆయన అందరు చూస్తుండగానే చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు.
పబ్లిగ్గా ముద్దు పెట్టినట్లు ఆదివారం జోరుగా వార్తలు వచ్చాయి. అయితే, తన పైన చేయి వేసిన గజరాజ్ పైన నగ్మా ఆగ్రహించారు. ఆయన చేతిని తీసేశారు. ఆమె అక్కడ ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుదిరిగారు.

నగ్మా
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి నగ్మాపై అదే పార్టీకి చెందిన ఒకరు అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించడంతో ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు

నగ్మా
హపూర్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గజరాజ్ అందరూ చూస్తుండగానే తన వంటిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించబోవడంతో తీవ్రంగా ఆగ్రహించిన నగ్మా ఆయన చేతిని తోసేసి తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.

నగ్మా
హాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, స్థానిక గురుద్వారాలో పూజలు జరపడానికి నగ్మా అక్కడికి వెళ్లారు. అప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా వార్తలు వచ్చినా ప్రచారం సమయంలో జరిగింది.

నగ్మా
ఎమ్మెల్యే గిరిరాజ్ చర్యను తీవ్రంగా ఖండించిన మహిళా హక్కుల ఉద్యమ కార్యకర్తలు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications