కోరిక తీర్చాలని వేధింపులు: విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్షంగా వ్యవహరించడంతో ఓ విద్యార్థిని ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సంఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో జరిగింది. ఇప్పుడు పోలీసులు మాత్రం నిందితులను అరెస్టు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది. ఈమె పక్క ఫ్లాట్ లో రాజ, రాహుల్, శివమ్ అనే ముగ్గురు యువకులు నివాసం ఉంటున్నారు.
గత నెల నుంచి ఈ ముగ్గురు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నారు. తమ లైంగికవాంఛ తీర్చకుంటే కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పిన విద్యార్థిని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

అయితే పోలీసులు మాత్రం పట్టించుకోకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వేధింపులు ఎక్కువ కావడంతో గురువారం ఆ విద్యార్థిని డెత్ నోట్ వ్రాసి బ్యాగ్ లో పెట్టుకుంది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికకు నచ్చ చెప్పారు.
కుటుంబ సభ్యులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లి న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. అయితే పోలీసులలో మాత్రం మార్పురాలేదు. గోడకు వేసిన సున్నం అన్న రకంగా ఉండిపోయారు. శుక్రవారం రాత్రి విద్యార్థిని ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది.
విషయం తెలుసుకున్న పోలీసులు చేతులు ఊపుకుంటూ వచ్చి నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పడంతో స్థానికులు మండిపడ్డారు. పోలీసుల నిర్లక్షం వలనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముగ్గురు యువకులు పరారైనారు.












Click it and Unblock the Notifications