హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు (వీడియో)
Recommended Video
అహ్మదాబాద్ : ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. హార్దిక్ మాట్లాడుతుండగా మైక్ వద్దకు వచ్చిన వ్యక్తి ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH Congress leader Hardik Patel slapped during a rally in Surendranagar,Gujarat pic.twitter.com/VqhJVJ7Xc4
— ANI (@ANI) April 19, 2019
సురేంద్రనగర్‌లోని బల్దానాలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. స్థానికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చిన ఓ వ్యక్తి హార్దిక్‌పై దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామంతో తొలుత షాక్ తిన్న హార్దిక్ వెంటనే ఆ వ్యక్తిని తోసేశాడు. ఈ లోపు పార్టీ కార్యకర్తలు, ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే తాను దాడి చేశానని సదరు వ్యక్తి చెప్పాడు. పటేల్ ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. అయితే దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలియలేదు. ఘటన అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన హార్దిక్ తనను భయభ్రాంతులకు గురిచేసేందుకే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications