చంద్రబాబుతో హరి భేటీ: లోకేష్ హిట్, ఎన్టీఆర్ కట్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదేళ్ల తర్వాత తిరిగి అధికారానికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే చంద్రబాబు తీవ్రమైన సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చేది. విజయం ద్వారా మరోసారి ఆయన నాయకత్వానికి తిరుగులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బావమరిది, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ శనివారం చంద్రబాబును కలిశారు. సీమాంధ్రలో విజయం సాధించినందుకు ఆయన చంద్రబాబును అభినందించారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి నందమూరి హరికృష్ణ తీవ్రంగానే ప్రయత్నించారు. హిందూపురం అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ దాన్ని చంద్రబాబు నందమూరి బాలకృష్ణకు కేటాయించారు. దాంతో కృష్ణా జిల్లాలోని ఏదైనా సీటు ఇవ్వాలని అడిగారు. కానీ చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో హరికృష్ణ పోటీ చేయలేకపోయారు. తనను ప్రశ్నించినట్లు, తనకు ఎదురు తిరిగినట్లు కనిపించే ఎవరినైనా సరే, చంద్రబాబు సహించరనేదానికి అది మరో ఉదాహరణగా నిలిచింది.

హరికృష్ణను దూరం పెట్టాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తనను ఎదిరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు రాజకీయ జీవితం లేకుండా అయింది. అలాగే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురంధేశ్వరికి విశాఖపట్నం లోకసభ సీటు దక్కకుండా చంద్రబాబే వ్యూహం చేసి అమలు చేశారని అంటారు. చివరకు ఆమెకు బిజెపి రాజంపేట సీటు కేటాయించింది. అయితే, ఆమె అక్కడ ఓటమి పాలయ్యారు.

Harikrishna meets Chandrababu: Nara Lokesh hit, Jr NTR cut

తన తాత పెట్టిన తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధమని ఎన్నిసార్లు ప్రకటించినా జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు చేరదీయలేదు. ఆయనను దూరం పెట్టాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి స్నేహాన్ని పటిష్టం చేసుకున్నారు. బిజెపితో బంధం పటిష్టమయ్యే కొద్దీ పవన్ కళ్యాణ్‌తో మరింత సాన్నిహిత్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీలో స్థానం ఉండకపోవచ్చు.

మరో విషయం కూడా ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా, చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో విజయంలో కొంత భాగం ఆయనకు కూడా దక్కుతుంది. దీంతో నారా లోకేష్ చంద్రబాబు వారసుడిగా భవిష్యత్తులో ముందుకు వచ్చే అవకాశం ఉంది. లోకేష్ స్థానంపైనే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో విభేదించారు. నారా లోకేష్ క్రమంగా ముందుకు వస్తున్న స్థితిలో మరోసారి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను చేరదీసి చిక్కుల్లో పడాలని చంద్రబాబు అనుకోవడం లేదని చెబుతారు. నారా లోకేష్ నాయకత్వాన్ని తన అల్లుడు అయినందున బాలయ్య వ్యతిరేకించకపోవచ్చు. నారా లోకేష్‌కు మార్గం సులభం చేసి పెట్టిన తర్వాత మరో వైపు చూడాలనే ఉద్దేశంతో చంద్రబాబు లేరని అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+