వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ 'బాహుబలి', భుజాలపైకెత్తి.. మోడీ అవాక్కు! (వీడియో)

ఎవ్వడంట.. ఎవ్వడంట.. పాట బ్యాక్ గ్రౌండుతోనే ఇప్పుడు బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండులో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలిలా హరీష్ రావత్ కనిపిస్తారు.

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: త్వరలో అయిదు రాష్ట్రాలఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ఓట్లను బుట్టలో వేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరికంటే భిన్నంగా ఆలోచించింది.

ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ బాహుబలి అవతారం ఎత్తారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై, అద్భుత విజయం సాధించిన బాహుబలిని కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్‌లో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటోంది.

అయితే, బాహుబలిని ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు అనువదించారు. బాహుబలి చిత్రంలోని 'ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది' అనే పాట అందరి నోట్లో ఇప్పటికీ నానుతోంది. ఇందులో హీరో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొని జలధార కింద పెడతారు.

తన తల్లి బిందెలో కింద నుంచి నీళ్లు తీసుకొని వచ్చి పైన ఉన్న శివలింగానికి పోస్తుంది. తన తల్లికి కష్టం కలగకుండా ఉండేందుకు ప్రభాస్.. శివలింగానికి అభిషేకం జరిగేలా జలధార కింద పెడతారు. ఇప్పుడు అదే పాటను హరీష్ రావత్‌కు అనువధించారు.

ఈ పాట బ్యాక్ గ్రౌండుతోనే ఇప్పుడు బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండులో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలిలా హరీష్ రావత్ కనిపిస్తారు. ప్రభాస్ శివలింగాన్ని ఎత్తితే.. రావత్ ఉత్తరాఖండ్‌ను తన భుజస్కందాలపై పెట్టుకున్నారు.

దీనిని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధం చేసి విడుదల చేయగా, హరీష్ రావత్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేసారు. ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీష్ రావత్ అని టైటిల్ పడగా.. పాట ప్రారంభమవుతుంది.

రాష్ట్రంలోని ప్రసిద్ధమైన ప్రాంతాల ఫోటోలు కనిపిస్తాయి. మరో విషయం ఏమంటే.. రావత్ ఉత్తరాఖండ్‌ను భుజంపై పెట్టుకొని నడుస్తుండగా బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయినట్లుగా కనిపిస్తారు. తనికెళ్ల భరణి స్థానంలో మోడీ కనిపిస్తారు. అసలు వీడియోను ఎడిట్ చేసి ఒక ముఖాలు మాత్రమే పెట్టారు.

English summary
Elections are on the head in five state and supporters and politicians are trying every possible way to woo voters, in such a case social media is the best platform to attract audience. There is a video which is going viral on social media circuit where you can see Uttarakhand CM Harsih Rawat as Bahubali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X