కాళ్లు పట్టుకుని ఏడుస్తుంటే.. వెకిలిగా నవ్విన సీఎం
ఉత్తరాఖండ్ : ఎదుటోడు ఏడుస్తుంటే.. ఎంత శత్రువైనా సరే.. మరీ పళ్లు ఇకిలిచ్చి నవ్వేయరు కదా! కానీ ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ వ్యవహారం ఇందుకు పూర్తి విరుద్దం. ఓ మహిళ ఆయన కాళ్ల మీద పడి తన గోడేదో వెల్లబోసుకుంటున్న వేళ.. అదేది పట్టనట్టు హరీశ్ రావత్ మాత్రం హాయిగా నవ్వేసుకున్నారు.
సీఎం హరీశ్ రావత్ వెకిలినవ్వును సోషల్ మీడియాలో నెటిజెన్స్ అంతా దుయ్యబడుతున్నారు. మహిళ కాళ్ల మీద పడి ఏడుస్తుంటే.. ఆమె బాధేంటో వినాల్సింది పోయి సీఎం అలా నిర్లక్ష్యంగా నవ్వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె రోదిస్తున్న కొద్ది సీఎం నవ్వుతూనే ఉండడం అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి మహిళా పోలీసులు కలగజేసుకుని సీఎం చేత హామి ఇప్పించేంతవరకు ఆ మహిళ అలా సీఎం కాళ్లు పట్టుకుని ఏడుస్తూనే ఉండడం గమనార్హం.
అయితే.. మహిళా పోలీసులే ఆమెకేదో నచ్చజెప్పి పంపించారు గానీ సీఎం హరీశ్ రావత్ మాత్రం ఆమె విషయంలో ఎలాంటి హామి ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెకిలినవ్వుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications