బిజెపి ఢిల్లీ సిఎం అభ్యర్థి హర్ష: అప్‌సెట్ కాలేదని గోయల్
న్యూఢిల్లీ: తమ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్‌ను భారతీయ జనతా పార్టీ బుధవారం ప్రకటించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హర్షవర్ధన్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ... ఢిల్లీ బిజెపిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
బుధవారం ఉదయం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చించింది. గతంలో హర్షవర్ధన్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో రాజ్‌నాథ్ హర్షవర్ధన్ పైన ప్రశంసలు గుప్పించారు.

అద్వానీ మాట్లాడుతూ... న్యూఢిల్లీ ఎన్నికలలో బిజెపి కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు విజయ్ గోయల్ సమక్షంలోనే హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. గోయల్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తాను అప్ సెట్ కాలేదన్నారు. తాను పార్టీకి విశ్వాసపాత్రుడినన్నారు.
కాగా, హర్షవర్ధన్ నాలుగుసార్లు శాసన సభ్యుడిగా గెలిచారు. క్లీన్ ఇమేజ్ ఉంది.












Click it and Unblock the Notifications