హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: సీఎంతోపాటు 67 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా ఇదే

ఛండీగఢ్: త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. 67 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. లాడ్వా నియోజకవర్గం నుంచి సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ పోటీ చేయనున్నట్లు వెల్లడించింది.

మాజీ మంత్రి అనిల్ విజ్.. 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్‌ జరగనుండగా, 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Haryana Assembly Elections BJP releases first list with 67 candidates including CM

కాగా, ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తీవర పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి గట్టి పోటీ నిచ్చేందుకు సిద్ధమైంది.

కాగా, ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చాక తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించనుంది. మరోవైపు, భారత రెజర్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వారు కూడా కాంగ్రెస్ తరపున హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బద్లి స్థానం నుంచి బజరంగ్ పూనియా పోటీ చేస్తారని, జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+