కారు డ్రైవర్ రచ్చ రచ్చ.. టోల్ ప్లాజా మహిళా ఉద్యోగిపై పిడిగుద్దులు (వీడియో)
గుర్‌గావ్ : హర్యానాలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. మహిళ అని చూడకుండా టోల్ ప్లాజా ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించాడు. విధి నిర్వహణలో భాగంగా టోల్ ఫీ అడిగినందుకు ఆమెపై చేయి చేసుకున్నాడు. కేర్కి దౌలా టోల్ ప్లాజాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేర్కి దౌలా టోల్ ప్లాజా మీదుగా వెళుతున్న ఓ కారు డ్రైవర్.. టోల్ ఫీ అడిగినందుకు రెచ్చిపోయాడు. అక్కడున్నది మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా చేతులకు పని చెప్పాడు. ఆమె డబ్బుల కోసం చేయి చాపగా.. తాను టోల్ ఫీ చెల్లించే ప్రసక్తే లేదంటూ వాదానకు దిగాడు. అంతేకాదు ఆమె చేతులను మెలికలు తిప్పి నానా రభస చేశాడు.

అంతటితో ఆగకుండా మరింత దురుసుగా ప్రవర్తించాడు సదరు కారు డ్రైవర్. ఆమె మొఖంపై పిడిగుద్దులు కురిపించాడు. వాడి దెబ్బలు తాళలేక ఆమె కన్నీరు మున్నీరైంది. అక్కడి సిబ్బంది పోగయి వాడ్ని పట్టుకునే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో టోల్ ప్లాజా దగ్గరకు చేరుకుని ఆరా తీశారు.
#WATCH Kherki Daula Toll Plaza employee hit by a car driver early morning today; case registered, accused absconding #Gurugram pic.twitter.com/AwdXxxOFNn
— ANI (@ANI) June 21, 2019
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు డ్రైవర్‌ను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. అయితే తోటి ఉద్యోగిపై దాడి జరగడాన్ని ఖండించారు తోటి సిబ్బంది. తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications