యువతి అభ్యంతరకర ఫోటో తీసి: క్యాంపస్‌లో పలుమార్లు రేప్

సోన్‌పేట్: హర్యానా రాష్ట్రంలోని సోన్‌పేట్ జిల్లాలోని ఓ ప్రయివేటు విశ్వవిద్యాలయంలో దారుణం వెలుగు చూసింది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పైన గత కొంతకాలంగా సామూహిక అత్యాచారం జరుగుతోంది.

రిపోర్ట్స్ ప్రకారం.. 20 ఏళ్ల బాధితురాలి పైన పలు సందర్భాల్లో ముగ్గురు నిందితులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం శనివారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు విశ్వవిద్యాలయ క్యాంపస్ అథారిటీస్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన ఓ ఫోటోను నిందితుల్లో ఒకడు క్లిక్ చేశాడని, దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ.. తన పైన అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితురాలి చెప్పారు.

 Haryana: Law student gangraped in private university campus

తన పైన అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెబితే తనకు చెందిన ఆ ఫోటోను నెట్లో పెడతానని నిందితుడు బెదిరించాడని, దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు.

బాధితురాలు విశ్వవిద్యాలయంలో 2013లో అడ్మిషన్ తీసుకున్నారని సమాచారం. నిందితుల్లో ఒకడైన హార్దిక్ బాధితురాలికి బంధువేనని పోలీసులు చెప్పారు. అతను తన స్నేహితులైన కరన్, వికాస్‌లకు ఆమెను పరిచయం చేశాడు. వీరు ముగ్గురే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురిని అరెస్టు చేశారు. వారి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+