భర్తకు 'భార్య' అశ్లీల చిత్రాలు.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్, ఆపై బ్లాక్ మెయిల్

మహిళ అశ్లీల చిత్రాలను, ఆమె భర్తకు, సోదరులకు, స్నేహితులకు పంపించాడు. అక్కడితో ఆగక.. వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానని, కొడుకును చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు.

ఫరీదాబాద్: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత పొద్దస్తమానం ఫేస్ బుక్, వాట్సాప్ లలో తలదూర్చేవారు ఈరోజుల్లో కోకొల్లలు. కేవలం అమ్మాయిలకు గాలం వేయడం కోసమే ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారూ లేకపోలేదు. కాబట్టి సోషల్ మీడియాలోను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పెరిగిపోతోంది.

తాజాగా ఫరీదాబాద్ లో ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా వేధింపులకు గురైంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఫరీదాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్ ద్వారా జస్కరన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో జస్కరన్ తనను తాను అమెరికన్ సిటిజన్ గా పేర్కొన్నాడు.

Haryana: Woman harassed, blackmailed by male FB friend

మొత్తానికి ఫేస్ బుక్ పరిచయంతో వీరిద్దరి మధ్య ఛాటింగ్ మొదలైంది. అయితే ఇదే అదునుగా భావించిన జస్కరన్.. ఆ మహిళతో మరింత చనువు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమెకు ఓ బహుమతిని కూడా పంపించగా.. ఆమె దాన్ని తిరస్కరించడంతో అతను తీవ్ర ఆగ్రహాం చెందాడు.

అంతేకాదు, బహుమతి స్వీకరించినందుకు ఆమెను తిట్టాడు. దీంతో ఆ మహిళ అతనితో మాట్లాడటం మానేసింది. మహిళ తీరుకు తీవ్ర అసహనానికి లోనైన జస్కరన్ ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి కలవడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. అతన్ని కలిసేందుకు మహిళ నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఇదే నేపథ్యంలో జస్కరన్ మహిళ అశ్లీల చిత్రాలను, ఆమె భర్తకు, సోదరులకు, స్నేహితులకు పంపించాడు. అక్కడితో ఆగక.. వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానని, కొడుకును చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. దీంతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించి జస్కరన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+