Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభుత్వానికి షాక్, కూటమిలో నో ప్రాబ్లమ్, ఆ కేసు వ్యవహారంలో డీసీఎం ప్లాన్ రివర్స్!

2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించింది. కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని జేడీఎస్‌ పోటీ చేసింది. హాసన్, మండ్య, కోలార్‌లో జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రెండవ దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 7న జరిగింది. అయితే దీనికి ముందే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వీడియోలు విడుదల కావడం కలకలం రేపింది.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. హాసన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ కేసు విచారణ చెయ్యడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సిట్‌ అధికారులు వేర్వేరుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు.

Hassan MP Prajwal Revanna s sex scandal case has not affected the alliance of BJP and JDS

మే 31వ తేదీన తాను భారత్ వస్తానని ప్రజ్వల్ రేవణ్ణ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే పరిషత్ ఎన్నికలు మొదలైనాయి. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు కారణంగా ఎన్డీఏ నుంచి జేడీఎస్ బయటకు వచ్చేస్తుందని కాంగ్రెస్ ఊహించింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసును అడ్డం పెట్టుకున్న కాంగ్రెస్ బీజేపీ, జేడీఎస్ నాయకులపై పదేపదే ఆరోపణలు చేస్తూ వారిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది.

ఇదే సమయంలో బీజేపీ, జేడీఎస్‌ నేతలు కాంగ్రెస్‌, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆరోపణలు చెయ్యడంతో ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ-జేడీఎస్ కూటమి పరిషత్ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ప్రజ్వల్ కేసు కూటమిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కర్ణాటకలోని మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు జూన్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, జూన్ 6వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Hassan MP Prajwal Revanna s sex scandal case has not affected the alliance of BJP and JDS

బీజేపీ-జేడీఎస్ పొత్తు ప్రకారం బీజేపీ జేడీఎస్‌కు రెండు సీట్లు వదులుకుంది. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇరు పార్టీల నేతలు కలిసి నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఆదివారం బీజేపీ-జేడీఎస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రజ్వల్ రేవణ్ణ కేసు తర్వాత జేడీఎస్ నుంచి కాంగ్రెస్ కు మద్దతు లభిస్తుందని అంతా భావించారు. డీసీఎం డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఎదగాలని భావించారు. కానీ కూటమి బలంగా ఉంది, కూటమి నుంచి జేడీఎస్ బయటకు రాకపోవడంతో డీకే శివకుమార్‌కు ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్కలిగ సామాజిక వర్గం జేడీఎస్ పార్టీ వెంట ఉందని మరోసారి రుజువు అయ్యిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద ప్రజ్వల్ రేవణ్ణ కేసు కారణంగా ఒక్కలిగుల ఓట్లు చీల్చాలని ప్రయత్నించిన డీకే శివకుమార్ కు ఎదురుదెబ్బ తగిలిందని బీజేపీ, జేడీఎస్ నాయకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+