
హత్రాస్ యువతి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం..కోర్టుకు వారి విజ్ఞప్తులే ఒత్తిడికి సాక్ష్యం
హత్రాస్ యువతి మృతి కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్రాస్ సంఘటనపై అటు ప్రభుత్వ ఒత్తిడి, సిబిఐ అధికారులు దర్యాప్తు నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు.
దీంతో అధికారులు వారిని ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేయగా
బాధిత యువతి తండ్రి నిరాకరించారు. తల్లి ఆస్పత్రికి వెళ్లి వైద్య చికిత్స చేయించుకుని తిరిగి వచ్చారు . కోర్టులో విచారణ సందర్భంగా వారు చేసిన విజ్ఞప్తులే వారిపై ఏ మేరకు ఒత్తిడి ఉందో స్పష్టంగా చెప్తున్నాయి.

హత్రాస్ యువతి తల్లిదండ్రులకు అనారోగ్యం
హత్రాస్ సంఘటనలో దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బాధితుడి తండ్రి మరియు తల్లి ఆరోగ్యం క్షీణించింది. సిబిఐ బృందం ఘటన జరిగిన ప్రదేశానికి కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళి విచారణ జరుపుతున్నారు. గతంలోనూ బాధితురాలి తండ్రికి బీపీ విపరీతంగా పెరిగింది. అప్పుడు కూడా ఆయన ఆసుపత్రికి వెళ్ళడానికి నిరాకరించారు. తాజాగా మరోమారు ఆయన ఆరోగ్యం క్షీణించింది . అయినా ఆయన ఆస్పత్రికి వెళ్ళటానికి నిరాకరించారు.

కోర్టుకు వెళ్ళిన ప్రయాణ అలసటతోనే అంటున్న అధికారులు
అయితే వారు ప్రయాణం చెయ్యటం వల్ల అలసిపోయారని ,అందుకే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెప్తున్నారు. కానీ వారిపై అధికారుల ఒత్తిడి ఉందని ఆరోపణలు వెల్లువగా మారాయి. బాధిత యువతి తల్లిదండ్రులు తాజాగా హైకోర్టులోని లక్నో బెంచ్‌లో హాజరైరాత్రి 11 గంటలకు హత్రాస్‌కు తిరిగి వచ్చారని చెప్తున్నారు . బాధితుడి కుటుంబం సోమవారం ఉదయం 5.30 గంటలకు హత్రాస్ నుండి లక్నోకు బయలుదేరింది. బాధితుడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు మరియు ఒక బావ కోర్టు విచారణ కోసం లక్నో వెళ్ళారు . ప్రయాణంలో అలసట కారణంగా కుటుంబ ఆరోగ్యం క్షీణించిందని అధికారులు చెబుతున్నారు.

యూపీ ప్రభుత్వ తీరుపై మండిపడిన లక్నో కోర్టు
యూపీలో జరిగిన హత్రాస్ సంఘటన గురించి సుమోటోగా కేసును తీసుకున్న హైకోర్టు సోమవారం యూపీ ప్రభుత్వాన్ని మందలించింది. మరోవైపు, హైకోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది . మరోవైపు, బాధితురాలి మృతదేహం అంత్యక్రియల అంశంపై యుపి పోలీసు ఉన్నతాధికారులకు పలు ప్రశ్నలు వేసింది . ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 2కు వాయిదా వేసింది. ఈ క్రమంలో బాధిత కుటుంబం కోర్టుకు హాజరయ్యింది .
Recommended Video

విచారణలో బాధితుల విజ్ఞప్తి .. ఒత్తిడికి ఇదే సాక్ష్యం
హైకోర్టు విచారణ సందర్భంగా, బాధితురాలి కుటుంబం హైకోర్టు ముందు మూడు డిమాండ్లు చేసింది. ఈ కేసును ఉత్తరప్రదేశ్ లో కాకుండా వెలుపల ఉన్న రాష్ట్రానికి బదిలీ చేయమని ఆదేశించాలని కోర్టును కోరింది. ఇది కాకుండా, దర్యాప్తు పూర్తయ్యే వరకు సిబిఐ దర్యాప్తులోని అన్ని వాస్తవాలను పూర్తిగా గోప్యంగా ఉంచాలని, అలాగే దర్యాప్తు కాలంలో కుటుంబానికి భద్రతను కల్పించాలని కుటుంబం అభ్యర్థించింది. వీరి అభ్యర్థనలను బట్టి వీరిపై ఏ మేరకు ఒత్తిడి ఉందో అర్ధం చేసుకోవచ్చు .