ఏ ఒక్కర్ని కూడా వదలొద్దు: భోలే బాబా
Hathras Stampede: ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న హత్రాస్ తొక్కిసలాట దుర్ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటనలో 121 మంది మరణించడం రాజకీయంగా భూకంపాన్ని పుట్టించింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఫల్యంగా అభివర్ణిస్తోన్నాయి అక్కడి ప్రతిపక్ష పార్టీలు. మృతుల కుటుంబాల తరఫున ధర్నాలు, ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
హత్రాస్‌లో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్ సభలో ఈ తొక్కిసలాట సంభవించిన విషయం తెలిసిందే. 121 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. దీన్ని నిర్వహించిన సూరజ్ పల్ అలియాస్ నారాయణ్ సకార్ హరి అలియాస్ భోలే బాబా పాద ధూళిని స్వీకరించడం కోసం భక్తులు ఎగబడటం తొక్కిసలాటకు దారి తీసింది.

ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. వారికి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనకు కారణమైన భోలే బాబా ప్రధాన అనుచరుడు దేవ్ ప్రకాష్ మధుకర్ అరెస్ట్ అయ్యాడు. దేశ రాజధానిలో పోలీసుల చేతికి చిక్కాడు. ఢిల్లీలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్లి.. అతని బంధించారు. మధుకర్ అరెస్ట్‌ను హత్రాస్ పోలీస్ సూపరింటెండెంట్ నిపుణ్ అగర్వాల్ ధృవీకరించారు. నేడు కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.
#WATCH | Hathras Stampede Accident | Mainpuri, UP: In a video statement, Surajpal also known as 'Bhole Baba' says, "... I am deeply saddened after the incident of July 2. May God give us the strength to bear this pain. Please keep faith in the government and the administration. I… pic.twitter.com/7HSrK2WNEM
— ANI (@ANI) July 6, 2024
ఈ దుర్ఘటనపై భోలే బాబా స్పందించారు. తొక్కిసలాట అనంతరం ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. దీనికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కర్ని కూడా వదలకూడదని అన్నారు. ఈ దుర్ఘటన తనను కలచి వేసిందని, నివారించదగ్గ దుర్ఘటన అని పేర్కొన్నారు.
ఈ ఘోర విషాదం నుంచి మృతుల కుటుంబీకులు, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారాయన. ఈ మేరకు తన తరఫున వాదిస్తోన్న సీనియర్ అడ్వొకేట్ ఏపీ సింగ్ ద్వారా సహాయక చర్యలను చేపడతానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications