16 ఏళ్ల మనవరాలిపై తాత అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక..!
నేటి కాలంలో బంధాలు అపహాస్యం అవుతున్నాయి. వావి వరుసలు కనుమరుగు అవుతున్నాయి. అందరితో కలిసి హాయిగా కాలం వెల్లదీయాల్సిన ఆ వృద్ధుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనవరాలిపై కన్నేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తాతే.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. 16 ఏళ్ల బాలికపై.. పశువులా మారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భానికి కారకుడయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగింది. ఎట్టకేలకు బాలిక నోరు విప్పడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మనవరాలు అయిన 16 ఏళ్ల బాలికపై తాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాక ఆమెను గర్భవతిని చేశాడు. బాలికను బెదిరించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా మూడు నెలలుగా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. అయితే ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడింది. దాంతో తండ్రి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భంతో ఉందని చెప్పారు. దీంతో బాలికను తండ్రి ఏం జరిగిందని నిలదీయగా అసలు విషయం బయటపడింది.
తండ్రి బయటకు వెళ్లినప్పుడు తాత తనపై దాదాపు మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ బాలిక బోరున విలపించింది. ఈ క్రమంలో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు వృద్ధుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాలిక తల్లి మృతి చెందడంతో ఇంట్లో తండ్రి, తాతలతోనే బాలిక పెరిగింది. తండ్రి పని మీద బయటకు వెళ్లగానే తన తాత తనపై అఘాయిత్యానికి పాల్పడేవాడని తెలిపింది.

తాను మూడు నెలల క్రితం సికింద్రరావ్ లోని మేనమాన ఇంటి నుంచి తండ్రి వద్దకు వచ్చానని అయితే జూన్ 20 నుంచి తన తాత నిజాముద్దీన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ అమిత్ పతక్ మాట్లాడుతూ బాలికను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు జరపగా ప్రెగ్నెంట్ అని తేలిందని అన్నారు. ఇక వృద్ధుడు నిజాముద్దీన్ ను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications