హ్యాట్సాఫ్: నొప్పులతో బాధపడుతున్న ఈ మహిళను హాస్పిటల్‌కు మోసుకెళ్లిన మథురా పోలీస్

మథురా: పోలీసులంటే కఠినస్తులు అనే పేరుమాత్రమే ఉందని అందరికీ తెలుసు. వారికి స్పందించే హృదయం, మానవత్వం ఉందని కొందరికి మాత్రమే తెలుసు. ఇలాంటి గుండెలు పిండేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మథురాలో ఓ నిండు గర్భవతిని ఓ పోలీసు తన చేతులపై కూర్చోబెట్టుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ అది సమయంకు చేరుకోలేకపోవడంతో పోలీసు చేతులే అంబులెన్స్ అయ్యాయి.

చేతులే అంబులెన్స్ అయిన వేళ...

చేతులే అంబులెన్స్ అయిన వేళ...

సెప్టెంబర్ 14 మథురా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది గుమికూడి ఉన్నారు. అక్కడ ఏమి జరుగుతుందో అని పక్కన ఉన్న మనుషులను పోలీస్ సోను కుమార్ అడిగారు. అక్కడ ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోందని చెప్పారు. కోర్టు పని మీద వెళుతున్న సోనుకుమార్ వెంటనే అక్కడికి వెళ్లి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను చూసి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కానీ నొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఇంకా అంబులెన్స్ రాలేదు. దీంతో ఆమెను దగ్గరలోని సాధారణ హాస్పిటల్‌కు మోసుకెళ్లాడు. అయితే ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని అక్కడి వారు చెప్పారు. వెంటనే పెద్ద హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని చెప్పారు. అక్కడ స్ట్రెచ్చర్ కూడా లేకపోవడంతో సోనుకుమార్ గర్భవతిని హాస్పిటల్ వరకు మోసుకెళ్లాడు.

తీవ్ర నొప్పులతో బాధపడటం చూశాను

తీవ్ర నొప్పులతో బాధపడటం చూశాను

మహిళకు నొప్పులు తీవ్రతరం అయ్యాయని సోనుకుమార్ చెప్పారు. మహిళ భర్త సహాయం చేయాల్సిందిగా అక్కడి స్థానికులను అర్థించడం తనను కలచివేసిందని చెప్పాడు. ఇక అంబులెన్స్ కూడా సమయానికి రాలేదని అప్పటికే గంట గడిచిపోయిందని చెప్పిన సోనుకుమార్... ఇక చేసేది ఏమిలేక తనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తెలిపాడు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.

 పోలీసుకు ధన్యవాదాలు తెలిపిన మహిళ

పోలీసుకు ధన్యవాదాలు తెలిపిన మహిళ

నొప్పులు తీవ్రతరమై ఉండగా తనను హాస్పిటల్‌కు సకాలంలో చేర్చిన సోనుకుమార్‌కు మహిళ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మహిళ భావన భర్త మహేష్ కూడా తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన గురించి మథురా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజెన్లు పోలీస్ సోనుకుమార్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+