Tata Nexon EV: నెక్స్ట్ లెవెల్ లగ్జరీ కారు: రూ.21 వేలతో బుకింగ్: ఫీచర్స్ ఇవే
ముంబై: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మరో ముందడుగు వేసింది. గతంలో వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వెహికల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సంస్థ.. నెక్సాన్ ఈవీ లగ్జరీ కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ రాత్రి ముంబైలో జరిగిన కార్యక్రమంలో టాటా మోటార్స్ ప్రతినిధులు ఈ కారును ఆవిష్కరించారు.
ఇదివరకు టాటా ఏస్ ఈవీ కమర్షియల్ వెహికల్‌ను ఈ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నెక్సాన్ ఈవీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. తాజాగా విడుదల చేసిన కారును కొత్త వర్షన్‌లోకి తీర్చిదిద్దింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ కారు బుకింగ్స్ ఆరంభం కానున్నాయి. ప్రారంభంలో 21,000 రూపాయలను చెల్లించి ఈ కారును ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ రెండు డిఫరెంట్ వేరియంట్‌లల్లో లభిస్తోంది. లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్‌లల్లో ఈ కారు అందుబాటులో ఉంది.లాంగ్ రేంజ్ వేరియంట్ 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 465 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణించవచ్చు. దీని కెపాసిటీ 142 బీహెచ్‌పీ. 215 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేయగలదు.
8.9 సెకెండ్ల వ్యవధిలోనే గరిష్ఠంగా 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. మిడ్ రేంజ్ వేరియంట్ బ్యాటరీ బ్యాకప్ 30 కేడబ్ల్యూహెచ్. ఒక్కసారి ఛార్జ్ చేసతే 325 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీని సామర్థ్యం 127 బీహెచ్‌పీ. గరిష్ఠంగా 215 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంటీరియర్‌లో కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ ఫీచర్స్ ఉన్నాయి. 8- స్పీకర్ జేబీఎల్‌తో ఆడియో పని చేస్తుంది. ఊఫర్ అదనం.
నెక్సాన్ ఈవీ మిడ్ రేంజ్ కారు ప్రైమ్ ధర 14.49 లక్షల రూపాయల నుంచి హైఎండ్‌లో 17.19 లక్షల రూపాయలు. లాంగ్ రేంజ్ కారు ధర.. 16.49 లక్షల రూపాయల వద్ద ఆరంభమౌతుంది. హైఎండ్ కారు ధర 19,54 లక్షల రూపాయలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలేనని కంపెనీ తెలిపింది.

మొత్తంగా ఏడు రంగుల్లో ఈ కారు లభిస్తుంది. ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, పర్పుల్, ప్రిస్టైన్ వైట్, ఇంటెన్సిటీల్, క్రియేటివ్ ఓషన్ బ్లూ, డేటానో గ్రే కలర్లల్లో ఈ ఈవీని రూపొందించింది టాటా మోటార్స్. వీ2వీ, వీ2ఎల్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. దేశీయ మార్కెట్‌లో ఈ తరహా కారు ఇదొక్కటేనని కంపెనీ యాజమాన్యం తెలిపింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ ఎస్ ఈవీలకు పోటీగా టాటా మోటార్స్.. నెక్సాన్ ఈవీని రూపొందించింది. ఆయా కార్లల్లో అందుబాటులో లేని అనేక ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. ఈ పండగ సీజన్‌లో కొనుగోలుదారుల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ యాజమాన్యం ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications