Nusrat Jahan: ఎంపీగా బిజీ బిజీ, కానీ ఏడాదికి రెండు సినిమాలు, న్యూ ఇయర్ డెసిషన్

ఒకేసారి రెండు పనులు చేయడం అసాధ్యం.. అదీ భిన్న రంగాల్లో రెండు పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాధారణంగా ఒక ఫీల్డ్ నుంచి వచ్చి మరో ఫీల్డ్‌లోకి మారే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ తిరిగి పాత రంగంలోకి వెళ్లే సాహసం చేయరు. కానీ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం చేస్తున్నారు. తనకు సినిమాల్లో నటించాలని ఉందని, ఏడాదికి ఒకటో, రెండు సినిమాల్లో నటిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు.

కొత్త ఏడాదిలో..

కొత్త ఏడాదిలో..

2020 వచ్చేసింది, కొత్త సంవత్సరానికి ప్రతీ ఒక్కరు తమ లైఫ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అలానే టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ కూడా.. 2020లో తన లక్ష్యాలను వివరించారు. ఇకపై ఏడాదికి రెండు సినిమాల్లో కూడా నటించాలని అనుకొంటున్నానని చెప్పారు. తనకు సినిమాలంటే పిచ్చి అని, ఎంపీగా తనను బసిర్హత్ ప్రజలు ఎన్నుకొన్న.. తనకు సినిమాల్లో మాత్రం నటించాలని ఉందని తెలిపారు.

సినిమా అంటే ప్రాణం

ఎంపీగా తనకు సమయమే సరిపోదని 29 ఏళ్ల సుందరి వివరించారు. కానీ సినిమాలపై ఆశలు వదులుకొలేకపోతున్నానని పేర్కొన్నారు. అంతేకాదు ఎంపీగా పనిచేస్తూనే, సినిమాల్లో నటిస్తానని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాలను తమ సిబ్బంది పక్కా ప్రణాళికతో పర్యవేక్షిస్తారని చెప్పారు.

షూటింగ్ మధ్యలో

షూటింగ్ ముగించినా తర్వాత లేదంటే మధ్యలో ఏదైనా రాజకీయ కార్యక్రమాలు ఉండేలా చూసుకొంటానని చెప్పారు. నటిగా ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకొంటున్నానని నుస్రత్ జహాన్ పేర్కొన్నారు. తాను అందంగా మేకప్ చేసుకొని, డిజైనర్ వస్త్రాలు ధరంచి, వెంట్రుకలు గాలికి ఎగురుతుంటే చూడాలని అనుకొంటున్నానని పేర్కొన్నారు.

గుర్తింపు ఇలా

గుర్తింపు ఇలా

నుస్రత్ జహాన్ బెంగాలీలో ‘ఆసుర్' సినిమాలో నటించారు. ‘హర్ బ్యోంకెష్' ‘జుల్ఫికర్' ‘లవ్ ఎక్స్ ప్రెస్' ‘ఆమీ జే కే తోమర్ హస్'లాంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీఎంసీలో చేరి బసిర్హత్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+