హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ కిలిపి వాడితే గుండెకు ప్రమాదమే..: శాస్త్రవేత్తల అధ్యయనం

న్యూఢిల్లీ: భారత ఔషధం హైడ్రోక్సిక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) కరోనా మహమ్మారి చికిత్సలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఔషధం అజిత్రోమైసిన్ మాత్రలు కూడా కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు. అయితే, ఈ రెండు మాత్రలను ఒకేసారి వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలికంగా వాడితే ప్రమాదమే..

దీర్ఘకాలికంగా వాడితే ప్రమాదమే..

స్వల్పకాలిక కోర్సులో భాగంగా హైడ్రోక్సిక్లోరోక్విన్ ముప్పై రోజులపాటు వాడితే ఎలాంటి ప్రమాదం లేదని.. కానీ, దీర్ఘకాలికంగా వాడితేనే హృదయ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీర్ఘ కాలికంగా హైడ్రోక్సిక్లోరోక్విన్ వాడటం వల్ల దుష్ప్రభావాలపై గత ఏప్రిల్ నెలలోనే యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ(ఈఎంఏ) కూడా హెచ్చరించింది. ప్రస్తుతం మరింత పరిశోధనలు జరిపిన అనంతరం మరో నివేదిక దీన్ని స్పష్టం చేసింది.

కరోనా నియంత్రణలో హైడ్రోక్సిక్లోరిన్..

కరోనా నియంత్రణలో హైడ్రోక్సిక్లోరిన్..

ఈ పరిశోధనకు సంబంధించిన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ రూమటాలజీ, మెడ్రివ్ లలో ప్రచురతమైంది. కాగా, కరోనా చికిత్సలో మలేరియాకు ఉపయోగించే హైడ్రోక్సిక్లోరోక్విన్ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. హైడ్రోక్సిక్లోరోక్విన్ కరోనాను నియంత్రించడంలో కొంత వరకు సఫలమైందని తెలిపారు. ఈ కారణంగా ప్రపంచ దేశాలు హైడ్రోక్సిక్లోరోక్విన్ ను వాడుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హైడ్రోక్సిక్లోరోక్విన్ వాడకంపై విస్తృత పరిశోధనలు మొదలయ్యాయి. హైడ్రోక్సిక్లోరోక్విన్.. ముప్పై రోజుల స్వల్పకాలిక కోర్సు వల్ల ప్రమాదమేమీ లేదని, కానీ, వీటిని దీర్ఘకాలికంగా వాడితేనే ప్రమాదమని తెలిపారు.

అజిత్రోమైసిన్‌తో కలిపి వాడితే గుండె సంబంధిత వ్యాధులు..

అజిత్రోమైసిన్‌తో కలిపి వాడితే గుండె సంబంధిత వ్యాధులు..

అంతేగాక, అజిత్రోమైసిన్‌తో కలిపి వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. దత 20 ఏళ్లలో హైడ్రోక్సిక్లోరోక్విన్ వాడిన దాదాపు 9.5 లక్షల మంది సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరం ఈ మేరకు నివేదికను రూపొందించినట్లు డానియల్ ఫ్రైటో అల్హాంబ్రా వెల్లడించారు. జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, స్పెయిన్, యూకే, అమెరికా దేశాలకు చెందిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే జరిగిన పరిశోధనలతోపాటు మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నియంత్రణలో ప్రభావం చూపుతుండటంతో భారత్ తోపాటు ప్రపంచంలోని సుమారు 150 దేశాలు హైడ్రోక్సిక్లోరోక్విన్ మాత్రలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+