కర్ణాటక సీఎంగా కుమారస్వామి, డేట్ ఫిక్స్: తిరుగుబాటు నేతలకు సినిమా, మంత్రి పదవులు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే మెజారిటీ శాసన సభ్యల మద్దతు లేదని సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సంబరాలు చేసుకుంటున్నారు. హెచ్.డి. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి తిరుగుబాటు దారులు సినిమా చూపించడానికి సిద్దం అవుతున్నారు.

గవర్నర్ కు లేఖలు
గవర్నర్ వాజుబాయ్ వాలాకు ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు లేఖలు ఇచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా సోమవారం హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

మంత్రి పదవులు
కర్ణాటకలో మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యడం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు వైరల్ అయ్యింది.

సిద్దూకు చాన్స్ లేదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మళ్లీ మంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు. ఇక జేడీఎస్ మీద తిరుగుబాటు చేసి మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, హెచ్.డి. కుమారస్వామి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన జమీర్ అహమ్మద్ తదితర ఎమ్మెల్యేలలో ఒక్కరికీ మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు.

తిరుగుబాటు నేతలకు సినిమా
హెచ్.డి. కుమారస్వామి సీఎం అయన తరువాత జేడీఎస్ మీద తిరుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు సినిమా చూపిస్తారని సమాచారం. ఇప్పటికే హెచ్.డి. కుమారస్వామి మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులు హడలిపోతున్నారు.

మాజీ ప్రధాని ఆశీస్సులు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, హెచ్ డి. కుమారస్వామికి నమ్మకంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు చాముండేశ్వరిలో సీఎంను ఓడించిన జీటీ. దేవేగౌడకు మంత్రి పదవులు గ్యారెంటీ అని సమాచారం. ఇక జేడీఎస్ నుంచి బయటకు వచ్చి సీఎం సిద్దరామయ్యకు సన్నిహితంగా ఉన్న నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications