మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, ఆడవాళ్లను కిడ్నాప్ చేసింది నువ్వు కాదా?, ఇదిగో రికార్డులు!
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీ పథకాలతో పల్లెటూరి ఆడబిడ్డలు పక్కదారి పట్టారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ఇప్పుడు దాని చుట్టు రాజకీయాలు తిరుగుతున్నాయి. కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ పై మాజీఎం కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్ అమ్మాయిలను అపహరించి, వారి తల్లిదండ్రుల నుండి బలవంతంగా భూమిని లాక్కున్నాడు అనేది పచ్చి నిజం అని, దీనికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రులను బెదిరించి భూమిని లాక్కున్న మాట వాస్తవమే. ఇది 1996-1997లో జరిగిందని, దానికి సంబంధించిన రికార్డులు తన దగ్గర ఉన్నాయని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అన్నారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని ఏం చేశాడో తనకు తెలుసు అని కుమారస్వామి ఆరోపించారు. బెంగుళూరు- మైసూర్ హైవేపై ఉన్న భూమిని లాక్కోవడానికి డీకే శివకుమార్ ఏమేమి చేశారో మాకు పూర్తిగా తెలుసు అని, ఆ పూర్తి సమాచారం కూడా నా దగ్గర ఉందని హెచ్ డీ కుమారస్వామి అన్నారు.
మీరు భూమిని కొనుగోలు చేశాము అని చెప్పుకుంటున్నారని, అయితే ఆ భూమి కోసం మీరు ఇచ్చిన చెక్కు నగదు కాలేదని, చెక్కు చెల్లలేదని రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయని డీసీఎం డీకే శివకుమార్ మీద మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపణలు చేశారు.
డీకే శివకుమార్ తనను చర్చకు పిలిచారని, దయచేసి చర్చకు రండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీ గురించి నేను రికార్డులతో సహ చర్చకు వస్తానని, డేట్ ఫిక్స్ చెయ్యడం మీదే ఆలస్యం అని, చర్చకు వచ్చే దమ్ము మీకువుంటే వెంటనే తనను పిలవాలని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ కు చాలెంజ్ చేశారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications