కొలీగ్సే కాటేశారు: అదృశ్యమైన హెచ్‌డీఎఫ్‌సీ వైస్ ప్రెసిడెంట్ శవమై కనిపించాడు
కొన్ని రోజులు క్రితం అదృశ్యమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సంఘ్వీ శవమై కనిపించారు. ముంబైలో గత ఐదురోజులుగా తను కనిపించకుండా పోయారు. కమలా మిల్స్ కాంపౌండ్‌లో ఉన్న తన కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఆయన కనిపించకుండా పోయారు. నవీ ముంబైలో ఓ కారును పోలీసులు కనుగొన్నారు. అందులో రక్తం మరకలతో ఉన్న కత్తి ఉంది.అదే సమయంలో తన ఫోన్ కూడా స్విఛ్ఛాఫ్ అవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే శనివారం ముంబైలో 20 ఏళ్ల సర్ఫరాజ్ షేక్ అనే క్యాబ్ డ్రైవర్‌ను అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. చిన్న వయసులోనే తాను వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోట్ అయినందున సిద్ధార్థ్ సింఘ్వీపై కొందరు తన సహోద్యోగులు ఓర్వలేకే ఆయన్ను చంపాల్సిందిగా కిరాయి ఇచ్చారని క్యాబ్ డ్రైవర్ తెలిపాడు. ఇందులో మొత్తం నలుగురు ఉన్నారని కుట్రలో ఒక మహిళకు కూడా భాగం ఉందని క్యాబ్ డ్రైవర్ షేక్ తెలిపాడు. క్యాబ్ డ్రైవర్ షేక్ సిద్ధార్థ్ సింఘ్వీని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే సింఘ్వీ తన భార్య ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి దక్షిణ ముంబై ప్రాంతంలోని మలబార్ హిల్‌లో నివాసముంటున్నాడు. అయితే ముంబై పోలీస్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాలు, థానే, నవీ ముంబైలోని సీసీకెమెరాల కంటికి సింఘ్వీ కారు దృశ్యాలు చిక్కలేదన్నారు పోలీసులు. మరేదైనా ఇతర రూట్లలో షేక్ కారు నడిపారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆరు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications