ఆమెకు 69, ఆయనకు 73.. త్వరలో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు...
పిల్లలు బ్రతుకుదెరువుకు విదేశాల బాట పట్టారు. ఇదీ సహజమే.. కానీ వృద్దుల సంగతి ఏంటీ. వారి ఆలానా పాలానా ఎవరూ చూడాలి. ఇద్దరు వృద్దులు ఒకేసారి చనిపోరు. దీంతో ఒకరు ఏకాకిగా మిగిలాల్సి వస్తోంది. ఒంటరితనం వారిని వేధించింది. దీనిని గమనించిన పిల్లలు మరో ఏకాకిని వెతికారు. ఆ ఇద్దరికీ కలిసి పెళ్లి చేయబోతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ వింత జరగబోతోంది.

ఒక్కటికాబోతున్న వృద్దులు
కర్ణాటక మైసూరు నగరంలో ఈ వింత పెళ్లి జరగనుంది. 73 ఏళ్ల రిటైర్డు ఇంజినీర్ 69 ఏళ్ల రిటైర్ టీచర్ ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరూ గత కొంత కాలం నుంచి ఒంటరి జీవితం గడుపుతున్నారు. వృద్ధురాలి ఒంటరి తనాన్ని చూడలేని కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఆమె ముందు వద్దన్నారు. కానీ చివరికి పెళ్ళికి అంగీకరించారు. వెంటనే కుటుంబ సభ్యులు వరుడు కావాలని ప్రకటన ఇచ్చారు. తోడుకోసం ఎదురుచూస్తున్న రిటైర్డు ఇంజినీర్ దొరికాడు.విశ్రాంత ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేయగా ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు.

ఏడేళ్ల క్రితం భార్య మృతి
వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితమే భార్య చనిపోయింది. ఉన్న ఒక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. కుమారుడు తండ్రిని అక్కడకి రమ్మని బ్రతిమాలినా అందుకు వృద్ధుడు విముఖత వ్యక్తం చేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. అది చూడలేని కుమారుడే తండ్రికి మరో పెళ్లి చేయాలని భావించాడు. అతడి ఒత్తిడితో వృద్దుడు పెళ్ళికి ఒకే చెప్పారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వీరి పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారుతోంది.

పెళ్లి కొడుకు- కూతురు
ఇరు కుటుంబాలకు చెందిన పిల్లలు పెళ్లికి అంగీకరించారు. త్వరలో బామ్మ మెడలో తాతగారు మూడుముళ్లూ వేయడానికి కొత్తపెళ్లికొడుకులా రెడీ అయిపోతున్నారు. వీరి పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. అందరూ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. లేటు వయస్సులో ఇద్దరూ ఒక్కటవుతూ.. నోటిలో నానుతున్నారు. ఇద్దరికీ రెండు కుటుంబాలు, మనమలు, మనమరాళ్లు ఉండగా.. పెళ్లి చేసుకొనుండటం చర్చకు దారితీసింది.
Recommended Video
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications